తొలిసారి భారత్‌లో పర్యటిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన రెండో రోజు పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. మరోవైపు ట్రంప్ సతీమణి మెలానియా ట్రంప్, కూతురు ఇవాంకా ట్రంప్ సైతం పలు కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. నేటి ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ట్రంప్ కుటుంబాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దంపతులు ఆత్మీయ స్వాగతం పలికారు.
నేటి ఉదయం 10 గంటలకు ట్రంప్ దంపతులు రాష్ట్రపతి భవన్‌కు వెళ్లారు. త్రివిధ దళాల నుంచి సైనిక వందనం స్వీకరించారు. అనంతరం సతీమణి మెలానియాతో కలిసి డోనాల్డ్ ట్రంప్ న్యూఢిల్లీలో మహాత్మా గాంధీ సమాధిని సందర్శించారు. రాజ్ ఘాట్ చేరుకున్న ట్రంప్ అక్కడ గాంధీజీ సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు.
రాజ్ ఘాట్ నుంచి నేరుగా హైదరాబాద్ హౌజ్ చేరుకున్న డోనాల్డ్ ట్రంప్‌నకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. అక్కడ భారత్, అమెరికా ఉన్నతాధికారులు, ప్రతినిథులు పలు కీలకాంశాలు చర్చించి ఒప్పందలు చేసుకోనున్నారు.
గాంధీ మెమోరియల్ రాజ్ ఘాట్ వద్ద ట్రంప్ దంపతులకు జాతిపిత గాంధీ జ్ఞాపికను అధికారులు అందజేశారు. మహాత్ముడి సమాధి సందర్శన సందర్భంగా ట్రంప్ మొక్కను నాటి హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.
గాంధీ సమాధికి ప్రదక్షిణ కూడా చేశారు. అనంతరం సమాధి వద్ద ఒక్క నిమిషం పాటు ట్రంప్ దంపతులు మౌనం వహించారు. రాజ్ ఘాట్ ప్రత్యేకతను అధికారులను అమెరికా అధ్యక్షుడు అడిగి తెలుసుకున్నారు.
విజిటర్స్ బుక్‌లో డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసి తన అభిప్రాయాల్ని అందులో నమోదు చేశారు. అనంతరం అమెరికా ప్రథమ పౌరురాలు మెలానియా కూడా విజిటర్స్ బుక్‌లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
రాష్ట్రపతి భవన్‌ను ట్రంప్ కూతురు, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంఃకా ట్రంప్ సందర్శించారు.
రాష్ట్రపతి భవన్ వద్ద త్రివిధ దళాల సైనిక వందనం స్వీకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
రాష్ట్రపతి భవన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ట్రంప్.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం పలుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింత్ దంపతులు (All Images Courtesy: Twitter/ANI)
Next Gallery