Vitamin B12: విటమిన్‌ బి12 లోపం గుండె జబ్బులకు దారి తీస్తుందా?

 Vitamin B12 Deficiency: విటమిన్ B12 మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం. ఇది ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో, నరాల ఆరోగ్యాన్ని కాపాడడంలో  DNA సంశ్లేషణలో కీలక పాత్ర పోషిస్తుంది.
 

 Vitamin B12 Deficiency:  విటమిన్ B12 లోపం అంటే మన శరీరానికి అవసరమైనంత విటమిన్ B12 లభించకపోవడం. ఇది చాలా రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఈ పమస్య దారి తీయడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి.  శాకాహారి లేదా శాఖాహార ఆహారం తీసుకునే వారు, జీర్ణవ్యవస్థ సమస్యలు ఉన్నవారు విటమిన్ B12 లోపానికి గురయ్యే అవకాశం ఎక్కువ.  పెర్నిషియస్ అనీమియా వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు విటమిన్ B12 శోషణను ప్రభావితం చేస్తాయి. కడుపు లేదా చిన్న ప్రేగు శస్త్రచికిత్స విటమిన్ B12 శోషణను తగ్గిస్తుంది.
 

1 /6

విటమిన్ B12 లోపం లక్షణాలు: అలసట, తల తిరుగుట, తిమ్మిరి, మానసిక స్థితి మార్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇలా మరికొన్ని అనారోగ్య సమస్యలు దారితీస్తాయి.   

2 /6

విటమిన్ B12 ఎక్కువగా లభించే ఆహారాలు  

3 /6

మాంసాలు: గొడ్డు మాంసం, మేక మాంసం, కుందేలు మాంసం, కోడి మాంసం, చేపలు (సాల్మన్, ట్యూనా), ఎండు చేపలు  

4 /6

పాల ఉత్పత్తులు: పాలు, పెరుగు, చీజ్, వెన్న  

5 /6

విటమిన్ B12 సప్లిమెంట్స్: డాక్టర్ సలహా మేరకు విటమిన్ B12 సప్లిమెంట్స్ తీసుకోవచ్చు.  

6 /6

గమనిక: ఈ సమాచారం కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలకు సంబంధించి వైద్యుడి సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.