మీరేదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు ఎవరికైనా టెక్స్ట్ మెసేజ్ పంపించాలనుకుంటే ఇది సులువైన మార్గం. గూగుల్ అసిస్టెంట్ సహాయంతో టైప్ చేయకుండానే మీరు ఏ కాంటాక్ట్‌కి అయినా టెక్స్ట్ మెసేజ్‌లు పంపవచ్చు.
మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ హోమ్ బటన్‌ను నొక్కి.. ఆపై 'హే గూగుల్' అని పలకండి. అప్పుడు గూగుల్ అసిస్టెంట్ యాక్టివేట్ చేయబడుతుంది.
ఆ తర్వాత 'సెండ్ ఏ మెసేజ్ టు - (మీరు మెసేజ్ పంపాలనుకుంటున్న కాంటాక్ట్ పేరు)' అని చెప్పండి. ఆ కాంటాక్ట్ తప్పనిసరిగా మీ ఫోన్‌లో సేవ్ చేయబడి ఉండాలి. అప్పుడే వాయిస్ అసిస్టెంట్ దాన్ని గుర్తించగలదు.
ఇప్పుడు మీరు ఏ యాప్ ద్వారా మెసేజ్ పంపాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేయండి. వాట్సాప్‌ని సెలెక్ట్ చేశాక... గూగుల్ అసిస్టెంట్‌లో మీరు పంపాలనుకుంటున్న టెక్స్ట్‌ను వాయిస్ రూపంలో ఇవ్వండి.
మీ వాయిస్‌ను గూగుల్ అసిస్టెంట్ రిపీట్ చేస్తుంది. ఆ తర్వాత.. మీరు ఈ సందేశాన్ని పంపాలనుకుంటున్నారా లేదా అని మొబైల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇప్పుడు మీరు 'అవును' అనే ఆప్షన్ ఎంచుకోండి. అంతే.. ఇక మీరు టైప్ చేయకుండానే ఆ టెక్స్ట్ మెసేజ్ వెళ్తుంది.