Constipation: శీతాకాలంలో మలబద్ధకం సమస్య సహజమే, మరి ఉపశమనం ఎలా

శీతాకాలంలో సహజంగా మలబద్ధకం సమస్య పెరిగిపోతుంటుంది. కొంతమందికి ఈ సమస్య ఎంతగా బాధిస్తుందంటే..రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టమైపోతుంటుంది. ఈ పరిస్థితుల్లో చలికాలంలో డైట్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. కొన్ని పదార్ధాలను డైట్‌లో చేర్చుకోవాలి.

Constipation: శీతాకాలంలో సహజంగా మలబద్ధకం సమస్య పెరిగిపోతుంటుంది. కొంతమందికి ఈ సమస్య ఎంతగా బాధిస్తుందంటే..రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టమైపోతుంటుంది. ఈ పరిస్థితుల్లో చలికాలంలో డైట్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. కొన్ని పదార్ధాలను డైట్‌లో చేర్చుకోవాలి.

1 /5

కిస్మిస్ అనేది మలబద్ధకం సమస్యకు మంచి పరిష్కారం. ఇందులో ప్రోటీన్లు, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే..రోజూ ఉదయం పరగడుపున కిస్మిస్ తినడం అలవాటు చేసుకోవాలి.

2 /5

ఆవు నెయ్యి మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కల్గిస్తుంది. కడుపులో గ్యాస్ సమస్య ఉన్నా నెయ్యి మంచి ప్రత్యామ్నాయం కాగలదు. రోజూ ఒక గ్లాసు వేడి పాలలో ఒక స్పూన్ నెయ్యి కలిపి తాగాలి.

3 /5

మెంతులు ప్రతిరోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.

4 /5

శీతాకాలంలో ఖర్జూరం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. తక్షణం వీటిని డైట్‌లో చేర్చడం ద్వారా ఇమ్యూనిటీ పెంచవచ్చు. దాంతోపాటు మలబద్ధకం సమస్య దూరమౌతుంది. దీనికోసం పాలలో ఖర్జూరం పండ్లను ఉడకబెట్టి తినాల్సి ఉంటుంది. 

5 /5

చలికాలంలో ఉసిరికాయలు మార్కెట్‌లో పుష్కలంగా లభిస్తాయి. ఈ పరిస్థితుల్లో మలబద్ధకం సమస్య వేధిస్తుంటే..రోజూ పరగడుపున ఉసిరికాయలు తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.