Animal Islands: ప్రపంచంలోనే అందమైన ఐల్యాండ్స్, కానీ జంతువులదే రాజ్యం

సముద్రం మధ్యలో ఉండే భూభాగాన్ని ఐల్యాండ్ అంటారు. ఇవి ఎంత అందంగా ఉంటాయో మాటల్లో వర్ణించలేం. నలువైపులా నీళ్లు ఉంటాయి. అందుకే ఇక్కడికి వెళ్లడం రిస్క్ కూడా. అదే సమయంలో కొన్ని ప్రమాదకరమైన జంతువులు కూడా ఉంటాయి. అలాంటి 6 ఐల్యాండ్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ జంతువులదే రాజ్యం..

Animal Islands: సముద్రం మధ్యలో ఉండే భూభాగాన్ని ఐల్యాండ్ అంటారు. ఇవి ఎంత అందంగా ఉంటాయో మాటల్లో వర్ణించలేం. నలువైపులా నీళ్లు ఉంటాయి. అందుకే ఇక్కడికి వెళ్లడం రిస్క్ కూడా. అదే సమయంలో కొన్ని ప్రమాదకరమైన జంతువులు కూడా ఉంటాయి. అలాంటి 6 ఐల్యాండ్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ జంతువులదే రాజ్యం..

1 /6

రేబిట్ ఐల్యాండ్ ఓకునేషియా అనేది జపాన్ సముద్రంలో ఓ చిన్న ఐల్యాండ్. హిరోషిమా ప్రాంతంలోని ఓ నగరంలో చిన్న భాగమిది. ఇక్కడ వేలాది సంఖ్యలో రేబిట్స్ చూడవచ్చు. మనుషుల కంటే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి

2 /6

కోకా ఐల్యాండ్ కోకా అనేది ఓ రకమైన జంతువు. ఇవి పగలంతా దాదాపుగా పడుకుని ఉంటాయి. చాలా క్యూట్‌గా కన్పిస్తాయి. ఆస్ట్రేలియాకు చెందిన ర్యాంట్ నెస్ట్ ఐల్యాండ్‌లో ఇవి పెద్ద సంఖ్యలో ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో కోకా జంతువులు ఇక్కడే ఉంటాయి. 

3 /6

క్యాట్ ఐల్యాండ్ జపాన్‌లోని ఎవోషిమా ఐల్యాండ్ పిల్లులకు ఆవాసంగా పిలుస్తారు. ఇక్కడ మనుషులు తక్కువ..పిల్లులు ఎక్కువ కన్పిస్తాయి. పిల్లులంటే ఇష్టపడేవారు ఇక్కడికి తిరిగేందుకు వస్తుంటారు

4 /6

రెడ్ క్రాబ్ ఐల్యాండ్ ఆస్ట్రేలియాకు చెందిన క్రిస్మస్ ఐల్యాండ్‌ను రెడ్ క్రాబ్ ఐల్యాండ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ వేలాది సంఖ్యలో పీతల జాతులు తిరుగుతూ కన్పిస్తాయి

5 /6

హార్స్ ఐల్యాండ్ ఇండోనేషియాకు చెందిన సుబా ఐల్యాండ్ అందమైన సముద్రపు గుర్రాలకు ప్రసిద్ధి. ఇక్కడ సుంబానీజ్, శాండల్‌వుడ్ వాటర్ బ్రీడ్ గుర్రాలు ఉంటాయి. ఇవి కేవలం ఇండోనేషియాలోనే లభించే గుర్రాలు.

6 /6

స్నేక్ ఐల్యాండ్ ఈ స్నేక్ ఐల్యాండ్ అట్లాంటిక్ మహా సముద్రంలో బ్రెజిల్ తీరాన ఉంది. ఈ ద్వీపంలో 2-4 వేల వరకు ప్రమాదకరమైన విషపూరిత పాములు ఉన్నాయి.