పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి చివరి తేదీ 31 మార్చి. ఆ లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే.. మీ పాన్ డియాక్టివేట్ అవుతుంది. ఇంతేకాకుండా మీరు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.
మీరు అప్‌డేట్ చేసిన ఐటీఆర్‌ను ఫైల్ చేయడానికి మార్చి 31 వరకు సమయం ఉంది. FY20 కోసం అప్‌డేట్ చేసిన ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ మార్చి 31. ఒకవేళ ఐటీఆర్ ఫైల్ చేయని పక్షంలో.. మీరు దీనిని కూడా ఫైల్ చేయవచ్చు.
స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే వారు మార్చి 31లోగా డీమ్యాట్ ఖాతాలో నామినీ పేరును యాడ్ చేయాలి. గడువు తేదీలోగా యాడ్ చేయకపోతే.. మీ డీమ్యాట్ ఖాతా నిలిచిపోనుంది. ఆ తరువాత మీరు స్టాక్‌లను కొనలేరు.. విక్రయించలేరు. దీన్ని సెబీ తప్పనిసరి చేసింది.
ఎల్‌ఐసీ పీఎం వయ వందన యోజనలో పెట్టుబడి పెట్టడానికి చివరి అవకాశం మార్చి 31వ తేదీ వరకు ఉంది. ఆ తరువాత ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం సాధ్యం కాదు. పథకం చివరి తేదీని పొడిగిస్తూ ప్రభుత్వం ఎటువంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు.
మీరు అధిక ప్రీమియంతో ఎల్‌ఐసీ పాలసీపై పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని పొందాలనుకుంటే.. అది మార్చి 31లోపు సభ్యత్వాన్ని పొందాలి. మార్చి 31 తర్వాత తగ్గింపు అందుబాటులో ఉండదు.