Saturn Retrograde in Aquarius 2023 in Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాల్లోకెల్లా నెమ్మెదిగా కదిలేది శని. ఈ గ్రహం ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని ఛేంజ్ చేస్తాడు. ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శనిదేవుడు...జూన్ 17న తిరోగమనం చెందనున్నాడు. నవంబరు 04 వరకు అతడు అదే దిశలో కదులుతూ ఉంటాడు. శని వక్రీ కారణంగా ముఖ్యంగా 5 రాశులవారు అశుభ ఫలితాలను పొందనున్నారు. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
కర్కాటకం: శని తిరోగమనం కర్కాటక రాశి వారికి చాలా సమస్యలను కలిగిస్తుంది. మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. అంతేకాకుండా మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది.
తుల: తిరోగమన శని తులారాశి వారికి కష్టాలను పెంచుతుంది. ఆఫీసులో సమస్యలు ఉండవచ్చు. జాబ్ చేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం. లవ్ లైఫ్ విషయంలో కాస్త ఓపికతో ఉండండి.
మేషం: శని తిరోగమనం మేషరాశి వారి జీవితంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మీ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు వస్తాయి. దాంపత్య జీవితంలో సమస్యలు రావచ్చు.
Also Read: Jupiter Rise 2023: ఏప్రిల్ 27న ఉదయించబోతున్న గురుడు.. ఈ 6 రాశులపై డబ్బు వర్షం..
వృషభం: తిరోగమన శని కారణంగా వృషభ రాశి వారికి పనిభారం పెరుగుతుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు మరికొంత కాలం వేచి చూడాలి. పనుల్లో జాప్యం జరుగుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోండి.
కుంభం: కుంభరాశిలో శని సాడే సతి కొనసాగుతోంది. అంతేకాకుండా ఇదే రాశిలో శనిదేవుడు తిరోగమనం చేయనున్నాడు. ఇది మీకు మంచిది కాదు. టెన్షన్ గురయ్యే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యం మరియు కెరీర్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. దాంపత్య జీవితంలో సమస్యలు రావచ్చు.
Also Read: Surya Grahan 2023: సూర్యగ్రహణం నాడు రాశి మార్పు యోగం.. ఏప్రిల్ 20 నుండి ఈ 5 రాశులవారు జాగ్రత్త..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
త్వరలో తిరోగమనం చెందబోతున్న శని.. వచ్చే 6 నెలలు వీరికి కష్టాలే కష్టాలు..