ఐపీఎల్-2018: మూడు జట్లు వచ్చేశాయ్..మరి నాలుగోది

ఐపీఎల్ -2018లో ప్లే‌ఆఫ్ ఆడే జట్లలో మూడింటిపై క్లారిటీ వచ్చేసింది.

Last Updated : May 20, 2018, 08:10 AM IST
ఐపీఎల్-2018: మూడు జట్లు వచ్చేశాయ్..మరి నాలుగోది

ఐపీఎల్ -2018లో ప్లే‌ఆఫ్ ఆడే జట్లలో మూడింటిపై క్లారిటీ వచ్చేసింది. ఇప్పటికే సన్ రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్ తొలి రెండు స్థానాల్లో నిలువగా.. శనివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌‌లో విజయంతో కోల్‌కతా నైట్ రైడర్స్  ప్లే‌ఆఫ్‌కు చేరిన మూడో జట్టుగా నిలిచింది. ఇక నాలుగో స్థానం కోసం ముంబాయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లకు అవకాశం ఉండగా.. నేడు ఢిల్లీతో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే ముంబై నేరుగా ప్లే ఆఫ్‌కు చేరుతుంది.

కేకేఆర్ vs ఎస్ఆర్‌హెచ్

హైద‌రాబాద్‌లో శనివారం రాజీవ్‌గాంధీ ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ స్టేడియంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై కోల్‌కతా విజయం సాధించింది. టాస్ గెలిచిన హైద‌రాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవ‌ర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయిన హైద‌రాబాద్ 172 ప‌రుగులు చేసింది. అయితే, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ 173 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించి నిర్ణీత 20 ఓవ‌ర్లలో రెండు బంతులు మిగిలి ఉండ‌గానే ఐదు వికెట్ల న‌ష్టానికి గాను 173 ప‌రుగులు చేసి విజయం సాధించి.. ప్లే‌ఆఫ్ బరిలో నిలిచింది.

ఆర్సీబీ vs ఆర్ఆర్

జైపూర్‌లోని స్వామి మాన్‌ సింగ్‌ స్టేడియంలో రాజస్థాన్‌ రాయల్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్ల జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో బెంగళూరు జ‌ట్టుపై 30 ప‌రుగుల తేడాతో రాజ‌స్థాన్ జ‌ట్టు విజ‌యం సాధించింది. టాస్ గెలిచిన రాజ‌స్థాన్ తొలత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు న‌ష్టపోయిన రాజ‌స్థాన్ 164 ప‌రుగులు చేసింది. అనంత‌రం 165 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్లలో ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండ‌గానే ఆలౌట్ అయి 134 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించింది. అత్యంత కీలకమైన మ్యాచ్‌ని గెల్చుకున్న రాజస్థాన్‌ రాయల్స్ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది.

Trending News