IPL 2020 Points Table: ఫస్టాఫ్ తర్వాత టాప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్.. అట్టడుగున పంజాబ్, మరి SRH ఎక్కడ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో లీగ్ దశలో ఫస్టాఫ్ ముగిసింది. లీగ్ స్టేజ్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత ఐపీఎల్ 2019 విజేత, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టిక (IPL 2020 Points Table)లో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు విజయాలు సాధించి 6 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో లీగ్ దశలో ఫస్టాఫ్ ముగిసింది. లీగ్ స్టేజ్‌లో సగం మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత ఐపీఎల్ 2019 విజేత, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఐపీఎల్ 2020 పాయింట్ల పట్టిక (IPL 2020 Points Table)లో అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మూడు విజయాలు సాధించి 6 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది.
Chris Gayle: ఇక బరిలోకి క్రిస్ గేల్.. పంజాబ్ జి‘గేల్’ మంటుందా?
అత్యంత నిరాశ పరిచిన జట్లుగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సీఎస్కే నిలిచాయి. పంజాబ్ కేవలం ఒక్క మ్యాచ్ నెగ్గి 2 పాయింట్లతో పట్టికలో అట్టడుగున ఉంది. కెప్టెన్ కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మాత్రమే పరుగుల దాహాన్ని తీర్చుకుంటుండగా ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యం చెందుతున్నారు. బౌలింగ్‌లో షమీ రాణిస్తున్నాడు. కానీ బ్యాటింగ్ వల్ల జట్టు ఎక్కువ మ్యాచ్‌లు ఓడింది. మరోవైపు ముంబై ఇండియన్స్ తమ చివరి 5 మ్యాచ్‌లలో 4 నెగ్గి, ఓవరాల్‌గా 5 విజయాలు ఖాతాలో వేసుకుంది. ఢిల్లీ సైతం 10 పాయింట్లతో ఉన్నా, మెరుగైన రన్‌రేట్ కారణంగా ముంబై తొలి స్థానాన్ని ఆక్రమించింది.
Ishant Sharma rib injury: ఐపిఎల్ 2020 నుండి ఇషాంత్ శర్మ ఔట్
[[{"fid":"194877","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"IPL 2020 points table (Image Credit: Google))","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"IPL 2020 points table (Image Credit: Google))","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"IPL 2020 points table (Image Credit: Google))","style":"border-width: 1px; border-style: solid;","class":"media-element file-default","data-delta":"1"}}]]
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని ఆర్సీబీ, దినేష్ కార్తీక్ సారథ్యం వహిస్తున్న కోల్‌కా నైట్ రైడర్స్ శక్తి మేరకు ఆడుతున్నాయి. ఆర్సీబీ సైతం 5 విజయాలు సాధించింది. రన్‌రేట్ తక్కువ ఉన్న కారణంగా మూడో స్థానంలో ఉంది. కేకేఆర్ 4 విజయాతో టాప్ 4 లో నిలిచింది. భువనేశ్వర్ కుమార్ దూరం కావడంతో బౌలింగ్‌లో డెత్ ఓవర్లలో సన్‌రైజర్స్ సమస్య ఎదుర్కొంటోంది. రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఈ విషయం తేటతెల్లమైంది. సన్‌రైజర్స్, రాజస్థాన్ మూడు విజయాలు సాధించాయి. అయితే రన్‌రేట్ ఆధారంగా సన్‌రైజర్స్ 5వ స్థానం, రాజస్థాన్ 6వ స్థానంలో కొనసాగుతున్నాయి.
IPL 2020లో తక్కువ రన్స్ ఇచ్చిన బెస్ట్ బౌలర్ ఎవరో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe