Chris Gayle: ఇక బరిలోకి క్రిస్ గేల్.. పంజాబ్ జి‘గేల్’ మంటుందా?

Chris Gayle Ready to play IPL 2020 | క్రికెట్ ప్రేమికులు మిస్ అవుతున్నది యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ సిక్సర్లు, మెరుపు ఇన్నింగ్స్‌లు. క్రిస్ గేల్ అభిమానులకు, ఐపీఎల్ 2020 ఫ్యాన్స్‌కు శుభవార్త. విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.

Last Updated : Oct 13, 2020, 03:11 PM IST
  • IPL 2020లో క్రికెట్ ప్రేమికులు మిస్ అవుతున్నది క్రిస్ గేల్ సిక్సర్లు, మెరుపు ఇన్నింగ్స్‌లు
  • విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు
  • ఉదర సమస్య నుంచి పూర్తిగా కోలుకున్న గేల్. ఇక రంగంలోకి దిగడమే తరువాయి
Chris Gayle: ఇక బరిలోకి క్రిస్ గేల్.. పంజాబ్ జి‘గేల్’ మంటుందా?

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో క్రికెట్ ప్రేమికులు మిస్ అవుతున్నది యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (Chris Gayle) సిక్సర్లు, మెరుపు ఇన్నింగ్స్‌లు. క్రిస్ గేల్ అభిమానులకు, ఐపీఎల్ 2020 ఫ్యాన్స్‌కు శుభవార్త (Chris Gayle recovers from stomach infection). విధ్వంసక ఆటగాడు క్రిస్ గేల్ మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఉదర సమస్య నుంచి గేల్ పూర్తిగా కోలుకున్నాడు. ఇక రంగంలోకి దిగడమే తరువాయి అని చెప్పవచ్చు.

ఐపీఎల్ తాజా సీజన్‌లో ఇప్పటివరకూ ఆడిన ఏడు మ్యాచ్‌లకుగానూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab) కేవలం ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. గేల్ రాకతోనైనా పంజాబ్ తలరాత మారుతుందేమోనని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం జరగనున్న మ్యాచ్‌లో క్రిస్ గేల్ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. అక్టోబర్ 15న షార్జా వేదికగా పంజాబ్, ఆర్సీబీ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ ద్వారా ఐపీఎల్ 2020లో యూనివర్సల్ బాస్ గేల్ ఆడబోతున్నాడు.

 

 

బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఎక్కువ మ్యాచ్‌లు ఓడిన పంజాబ్ జట్టుకు గేల్ చేరిక లాభించనుంది. క్రిస్ గేల్ కోలుకున్నాడని, తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించాడని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మేనేజ్‌మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. ఫస్టాఫ్‌లో నిరాశపరిచిన పంజాబ్ సెకండాఫ్‌లో కనీసం మెరుపులు మెరిపించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మాత్రమే జట్టు భారాన్ని మోస్తున్నారు.

Also Read : David Warner: ఐపీఎల్‌లో సరిలేరు నీకెవ్వరూ 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News