న్యూఢిల్లీ: క్రికెట్‌లో బ్యాట్స్‌మేన్‌కి ఫ్రీ హిట్‌ ( Free hit ) ఉన్నట్టు బౌలర్లకు కూడా ఫ్రీ బాల్‌ రూల్ పెట్టి ఓవర్లలో కౌంట్ అవకుండా బంతిని వేసే అవకాశం ఇవ్వాలని టీమిండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ ( Ravichandran Ashwin ) అభిప్రాయపడ్డాడు. ఫ్రీ హిట్ నిబంధనతో బ్యాట్స్‌మెన్ చాలా ఎంజాయ్ చేస్తున్నారని పరోక్షంగా కామెంట్స్ చేసిన అశ్విన్.. బౌలర్లకు అలాంటి ఛాన్స్ ఇద్దామని అన్నాడు. బౌలర్ ఫ్రీ బాల్ వేసినప్పుడు బ్యాట్స్‌మేన్‌ ఔటైతే బ్యాటింగ్‌ జట్టు స్కోర్ నుంచి ఐదు పరుగులు తగ్గించాలని అశ్విన్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు అశ్విన్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. Also read this : MS Dhoni, Rohit Sharma: ధోనీ ఫ్యాన్స్ vs రోహిత్ శర్మ ఫ్యాన్స్ వార్



IPL 2020 లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బరిలోకి దిగుతున్న అశ్విన్ గతేడాది ఐపీఎల్‌లో జోస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ ( Mankading )  విధానంలో ఔట్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీంతో ఈసారి అశ్విన్‌ను ఆ విధానం పాటించొద్దని సూచిస్తానని ఆ జట్టు హెడ్‌కోచ్‌ రికీ పాంటింగ్‌ తెలిపాడు. ఐతే అశ్విన్ మాత్రం మాన్కడింగ్‌ విధానాన్ని పరోక్షంగా సమర్థించుకుంటూ అందుకు ప్రత్యామ్నాయంగా మరోసారి ఇలా ఫ్రీ బాల్ ప్రతిపాదనను తెరపైకి తీసుకురావడం గమనార్హం. Also read : Adipurush: సీత పాత్రకు హీరోయిన్ ఖరారు ?