Adipurush: సీత పాత్రకు హీరోయిన్ ఖరారు ?

తొలుత సీత పాత్ర కోసం మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించిన హీరోయిన్ కీర్తి సురేష్‌ని ( Keerthy Suresh ) తీసుకోవాలని భావించారని వార్తలొచ్చాయి. ఐతే ఆమెకు ఉత్తరాదిన ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడం, ఆదిపురుష్ చిత్రానికి బాలీవుడ్ మార్కెట్ ముఖ్యమైనది కావడంతో ఆమె పేరును పక్కకుపెట్టారనే టాక్ వినిపించింది.

Last Updated : Aug 24, 2020, 11:52 PM IST
Adipurush: సీత పాత్రకు హీరోయిన్ ఖరారు ?

Prabhas శ్రీరాముడి పాత్రలో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్టు ఆదిపురుష్ మూవీలో సీత పాత్ర కోసం హీరోయిన్ అన్వేషణలో ఉన్న ఆ చిత్ర దర్శకుడు ఓం రావుత్.. ప్రస్తుతం కియారా అద్వాని ( Kiara Advani ) పేరును పరిశీలిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. తొలుత సీత పాత్ర కోసం మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో జీవించిన హీరోయిన్ కీర్తి సురేష్‌ని ( Keerthy Suresh ) తీసుకోవాలని భావించారని వార్తలొచ్చాయి. ఐతే ఆమెకు ఉత్తరాదిన ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడం, ఆదిపురుష్ చిత్రానికి బాలీవుడ్ మార్కెట్ ముఖ్యమైనది కావడంతో ఆమె పేరును పక్కకుపెట్టారనే టాక్ వినిపించింది. ఆ తర్వాత ప్రియాంకా చోప్రా పేరు ప్రముఖంగా వినిపించింది. ఐతే, బాలీవుడ్‌లో అల్ట్రా మోడర్న్ హీరోయిన్‌గా ఉన్న ప్రియాంకా చోప్రా సీత పాత్రలో నటిస్తే.. ఆడియెన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదోననే సందేహాల మధ్య ఆమె పేరును కూడా పక్కకుపెట్టి తాజాగా కియారా అద్వాని పేరును పరిశీలిస్తున్నట్టు బాలీవుడ్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. Also read : SSR autopsy report: సుశాంత్ పోస్టుమార్టం నివేదికపై అనేక అనుమానాలు

భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రం హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఓం రావుత్ తెరకెక్కించిన తన్హాజీ చిత్రంలో విలన్ పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో కూడా విలన్ పాత్రలో రావణుడిగా ( Saif Ali Khan as Ravan) కనిపించనున్నట్టు టాక్. Also read : Honey trap: సెక్స్ వర్కర్‌తో ఐఎస్ఐ హనీ ట్రాప్.. ఒకరు అరెస్ట్

Trending News