Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో 1500లకు పైగా నమోదైన కేసులు కాస్త.. వేయికి చేరువలో నమోదవుతున్నాయి. ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. కరోనా కేసుల కన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అయితే గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,736 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24 గంటల్లో శుక్రవారం ( నవంబరు 13న ) రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో కొత్తగా 1,050 కరోనా కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,56,713 కి చేరగా.. మరణాల సంఖ్య 1,401 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 


రాష్ట్రవ్యాప్తంగా ( Telangana ) కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,38,908 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 16,404 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 93.06 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. Also read: Most Eligible Bachelor Movie: చిచ్చుబుడ్డి కాల్చిన అఖిల్, పూజా హెగ్డే


ఇదిలావుంటే.. శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా 41,002 కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 13వ తేదీ వరకు మొత్తం 48,53,169 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా..  హైదరాబాద్ పరిధిలో 232 కేసులు నమోదయ్యాయి. అయితే.. జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.. Also read: Crack Movie: మాస్ మాహారాజా.. మాస్ బీట్ చూశారా..?


[[{"fid":"197880","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణలో కరోనా కేసులు.."}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణలో కరోనా కేసులు..","class":"media-element file-default","data-delta":"1"}}]]


 


Also read: Malavika Mohanan: అందంతో హీటెక్కిస్తున్న మాళవిక


Also read: Katrina Kaif: మాల్దీవుల్లో కత్రినా ఎంజాయ్.. ఫొటోలు చూశారా?


Also read: Rashmi Gautam: చీరలో వయ్యరాలు ఒలకబోస్తున్న రష్మీ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe