GHMC Elections 2020: బండి సంజయ్, అక్బరుద్దీన్‌పై కేసు
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు (GHMC Elections 2020) సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూసుకెళ్తూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi)పై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు.
Greater Hyderabad Elections 2020: హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు (GHMC Elections 2020) సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్ని ప్రచారంలో దూసుకెళ్తూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రస్థాయిలో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ఎంఐఎం పార్టీ నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi)పై పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు. గ్రేటర్ ప్రచారంలో భాగంగా వీరిద్దరూ అనుచితంగా వ్యాఖ్యలు చేసినందుకు గాను హైదరాబాద్ పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేశారు. ఈ మేరకు వీరిద్దరిపై ఎస్ఆర్ నగర్ పోలీసులు (Hyderabad SR Nagar police ) ఐపీఎస్ 505 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. Also read: Asaduddin Owaisi: ఉగ్రవాదంపై అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇటీవల జీహెచ్‌ఎంసీ ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్ రోడ్ షోలో పాల్గొన్న బండి సంజయ్ ఎంఐఎం దారుస్సాలాం కూల్చివేస్తామని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా పాతబస్తీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్సేన్ సాగర్ కట్టపైనున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ ఘాట్‌లను కూల్చివేస్తామని అక్బరుద్దీన్ ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరువురు నేతలపై సుమోటో కింద పోలీసుల కేసు నమోదు చేశారు. అయితే ఇటీవల ఓయూలోకి అనుమతి లేకుండా వెళ్లి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
Also read: Samantha Akkineni: మాల్దీవుల్లో సమంతా ఎంజాయ్.. పిక్స్ వైరల్
Also read: Kiara Advani: ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న కియారా అద్వానీ.. లేటెస్ట్ పిక్స్
Also read: Nidhhi Agerwal: హుషారెక్కిస్తున్న ‘నిధి’ సోయగాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe