Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నిత్యం పెరుగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి పైగా నమోదైన కేసులు కాస్త.. ఇటీవల కాలంలో వేయికి తక్కువగా నమోదవుతున్నాయి. కేసులతోపాటు.. నిత్యం కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( నవంబరు 26న ) గురువారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 761 కరోనా (Covid-19) కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల ( positive cases) సంఖ్య 2,67,665 కి చేరగా.. మరణాల సంఖ్య 1,448 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Gujarat: కోవిడ్‌ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24గంట్లలో ఈ వైరస్ నుంచి 702 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా (Telangana) కరోనావైరస్ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,55,378 కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రస్తుతం తెలంగాణలో 10,839 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 95.40 శాతం ఉండగా.. మరణాల రేటు 0.54 శాతంగా ఉంది. 


[[{"fid":"199410","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణ కరోనా కేసులు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణ కరోనా కేసులు"}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణ కరోనా కేసులు","class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇదిలావుంటే.. గురువారం తెలంగాణ వ్యాప్తంగా 42,242 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 26వ తేదీ వరకు మొత్తం 53,32,150 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 136 కేసులు నమోదయ్యాయి. 


Also read: Nidhhi Agerwal: హుషారెక్కిస్తున్న ‘నిధి’‌ సోయగాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe