Gujarat: కోవిడ్‌ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

గుజరాత్‌ (Gujarat) లోని రాజ్‌కోట్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రి (COVID Hospital) లో గురువారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు కరోనా రోగులు (Corona patients ) మరణించగా.. పలువురు గాయపడ్డారు.

Last Updated : Nov 27, 2020, 08:58 AM IST
  • కోవిడ్ ఆసుపత్రి (COVID Hospital) లో గురువారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు కరోనా రోగులు (Corona patients ) మరణించగా.. పలువురు గాయపడ్డారు.
  • ప్రమాద సమయలో ఆసుపత్రిలో మొత్తం 33 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.
  • ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ (CM Vijay Rupani) దర్యాప్తునకు ఆదేశించారు.
Gujarat: కోవిడ్‌ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురు మృతి

Fire breaks in COVID hospital - Five people died: రాజ్‌కోట్‌: గుజరాత్‌ (Gujarat) లోని రాజ్‌కోట్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రి (COVID Hospital) లో గురువారం అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు కరోనా రోగులు (Corona patients ) మరణించగా.. పలువురు గాయపడ్డారు. రాజ్‌కోట్ నగరంలోని ఉదయ్ శివానంద్ కోవిడ్ ఆసుపత్రి (Shivanand COVID Hospital in Rajkot) లోని ఐసీయూ విభాగంలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. దీంతో ఐసీయూలో చికిత్స పొంతున్న ఐగుగురు ( Five Corona patients died) కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో ఐసీయూలో 11 మంది రోగులున్నారని వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రమాద సమయలో ఆసుపత్రిలో మొత్తం 33 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఐసీయూలో మంటలు చెలరేగాయి. Also read: Tejaswi Surya: బీజేపీ ఎంపీ తేజస్విపై కేసు

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నగరంలోని మరో ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ అగ్నిప్రమాదం సంభవించిందని పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే.. శివానంద్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ (CM Vijay Rupani) దర్యాప్తునకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మృతులకు ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ సంతాపం తెలిపారు. Also read: Nidhhi Agerwal: హుషారెక్కిస్తున్న ‘నిధి’‌ సోయగాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News