Coronavirus Updates in Telangana: హైదరాబాద్‌: తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజుల నుంచి రాష్ట్రంలో వేయికి తక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతోపాటు నిత్యం కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ( డిసెంబరు 3న ) గురువారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 631 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి కారణంగా నిన్న ఇద్దరు (2) మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల ( positive cases) సంఖ్య 2,72,123 కి చేరగా.. మరణాల సంఖ్య 1,467 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ ( TS Health Ministry ) శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also Read| GHMC Exit Polls 2020: ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయంటే!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత 24గంట్లలో 802 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ( Telangana ) కరోనావైరస్ మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,61,830 కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో 8,826 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 96.21 శాతం ఉండగా.. మరణాల రేటు 0.53 శాతం ఉంది. Also read: GHMC Election Results: మధ్యాహ్నానికి తొలి ఫలితం!


ఇదిలావుంటే.. గురువారం తెలంగాణ వ్యాప్తంగా 57,405 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి డిసెంబరు 3వ తేదీ వరకు మొత్తం 56,62,711 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అయితే నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 109 కేసులు నమోదయ్యాయి. Also read: Dimple Hayathi: మత్తెక్కిస్తున్న డింపుల్ హయతి.. లేటెస్ట్ పిక్స్


[[{"fid":"200493","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణ కరోనా కేసులు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"telangana corona cases bulletin ","field_file_image_title_text[und][0][value]":"తెలంగాణ కరోనా కేసులు"}},"link_text":false,"attributes":{"alt":"telangana corona cases bulletin ","title":"తెలంగాణ కరోనా కేసులు","class":"media-element file-default","data-delta":"1"}}]]