GHMC Election Results: మధ్యాహ్నానికి తొలి ఫలితం!

మాటల తూటాలు పేలిన గ్రేటర్‌ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్‌ ఎన్నికల్లో (GHMC Election 2020 ) ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి.. బల్దియాలో ఎవరు పట్టు నిలుపుకోనున్నారు.. పోటీ చేసిన 1,122 మంది అభ్యర్ధుల్లో గెలిచే 150 మంది నేతలు ఎవరు..? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది.

Last Updated : Dec 4, 2020, 07:00 AM IST
  • ఈ రోజు ఉదయం 8గంటలకు జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు కరోనా నిబంధనలతో పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు.
  • అయితే 11గంటల నాటికి జీహెచ్ఎంసీ మొదటి ఫలితం (GHMC Election Results) పై స్పష్టత రానుంది.
  • ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్‌ బాక్సులను లెక్కించనున్నారు.
GHMC Election Results: మధ్యాహ్నానికి తొలి ఫలితం!

GHMC Election 2020 Results: హైదరాబాద్: మాటల తూటాలు పేలిన గ్రేటర్‌ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్‌ ఎన్నికల్లో ( GHMC Election 2020 ) ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి.. బల్దియాలో ఎవరు పట్టు నిలుపుకోనున్నారు.. పోటీ చేసిన 1,122 మంది అభ్యర్ధుల్లో గెలిచే 150 మంది నేతలు ఎవరు..? ఈ ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈ రోజు ఉదయం 8గంటలకు జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికారులు కరోనా నిబంధనలతో పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. అయితే 11గంటల నాటికి జీహెచ్ఎంసీ మొదటి ఫలితం ( GHMC Election Results ) పై స్పష్టత రానుంది. మధ్యాహ్నం 3గంటల నాటికి గెలిచెదెవరో ఓడేదెవరో కూడా తేలిపోనుంది. ఇక సాయంత్రం నాటికి 150 డివిజన్ల ఫలితాలు వెలువడుతాయని అధికారులు పేర్కొంటున్నారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం బ్యాలెట్‌ బాక్సులను లెక్కించనున్నారు. Also Read| GHMC Exit Polls 2020: ఏ పార్టీకి ఎన్ని సీట్లొస్తాయంటే!

ఈ మేరకు జీహెచ్ఎంసీ ( GHMC ) అధికారులు 30 సర్కిళ్లలోని 30 ప్రదేశాల్లో లెక్కింపు కేంద్రాల కోసం 150 హాళ్లను సిద్ధం చేశారు. ప్రతి హాల్‌లోనూ 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై 1000 ఓట్ల లెక్కింపు వంతున ఒక రౌండ్‌లోనే 14 వేల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నగరంలోని మెజారిటీ డివిజన్లలో 30 వేలలోపు ఓట్లు పోలైన విషయం తెలిసిందే. దీంతో రెండు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని హాళ్లలో గరిష్ఠంగా మూడు రౌండ్‌లలోనే లెక్కింపు పూర్తి కానుంది. 11 వేల ఓట్లు పోలైన మెహిదీపట్నం ఫలితం ఒకే రౌండ్‌లోనే రానుంది. చివరగా 37వేలకు పైగా ఓట్లు నమోదైన మైలార్‌దేవ్‌పల్లి డివిజన్‌ ఫలితం వచ్చే అవకాశముంది. Also read: TS ICET-2020: టీఎస్ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

ఒక్కో రౌండ్‌ ఓట్ల లెక్కింపునకు గరిష్టంగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టనుంది. ఈ ఓట్ల లెక్కింపులో 8,152 మంది సిబ్బంది పాల్గొంటుంన్నారు. సీసీటీవీ కెమెరాలతో లెక్కింపును రికార్డు చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ ( Hyderabad ) పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.  Also read: Double Decker buses: హైదరాబాద్ వీధుల్లో మరోసారి డబుల్ డెక్కర్ బస్సులు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News