Indo Pak war :చైనాకు చెక్ ; భారత్ కు అమెరికా సపోర్ట్

                   

Last Updated : Feb 28, 2019, 01:03 PM IST
Indo Pak war :చైనాకు చెక్ ; భారత్ కు అమెరికా సపోర్ట్

సైనిక చర్యలోనే కాదు..దౌత్యపరంగాను భారత్ తన విజయపరంపర కొనసాగిస్తోంది. భారత్ దూకుడు అడ్డుకట్ట వేసేందుకు.. చైనా సపోర్టు కోసం పాకులాడతోన్న పాక్ కు భారత్ తనదైన శైలిలో ముందుకు వెళ్లోంది.ఇప్పటికే ఈ విషయంలో అమెరికాతో జపాన్, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాల మద్దతు కూటగట్టింది. వీటితో పాటు పలు ప్రపంచదేశాలు భారత్ కు నైతిక మద్దతు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఆయా దేశాలు భారత్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించాయి. పుల్వామా దాడికి ముక్తకంఠతో ఆయా దేశాలు ఖండిస్తున్నాయి. 

ఫలించిన భారత్ రాయబారం

ఇప్పుడు తాజా అమెరికా మరో అడుగుముందుకుసి ఉగ్రమూలను ఏరివేత చేపడుతున్న భారత్ సహకరించేందుకు ముందుకు వచ్చింది. మరోవైపు ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని పాక్ హోచ్చరించింది. ఈ రోజు అమెరికా విదేశాంగ శాఖ మంత్రితో భారత్ విదేశాంగ కార్యదర్శి అజిత్ ధోవల్ మంతనాలు జరిపారు. ఈ క్రమంలో అమెరికా  సాయం చేసేందుకు ముందుకు వస్తామని హామీ ఇచ్చింది. తాజా  పరిణామం పాక్ కు పరోక్షంగా సహకరిస్తున్న చైనాకు గట్టి షాక్ తలిగింది.

Trending News