14 Movie Teaser: ప్రముఖ సింగర్, బిగ్ బాస్ కంటెస్టంట్ నోయల్ సీన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 14. నోయన్ సరసన విశాఖ ధిమిన్ జంటగా నటిస్తోంది. పోసాని కృష్ణ మురళి, శ్రీకాంత్ అయ్యంగార్, రతన్, జబర్దస్త్ మహేష్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లక్ష్మి శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సుబ్బారావు రాయణ, శివకృష్ణ నిచ్చెనమెట్ల నిర్మిస్తున్నారు. నిన్ననే నటుడు శ్రీవిష్ణు చేతుల మీదుగా 14 మూవీ టీజర్ విడుదలైంది. ఈ సందర్భంగా శ్రీవిష్ణు మాట్లాడుతూ.. 15 సంవత్సరాల క్రితం మేమంతా సినిమాల్లో అవకాశం వెదుక్కుంటూ ఒకరికొకరం సహాయం చేసుకునే వాళ్లం అని వెల్లడించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు అందుబాటులో ఉన్న వాట్సాప్,ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాలు ఏవీ అప్పుడు లేవు. అయినా ప్రతీ రోజు సుభాష్ మాస్టర్ అడ్డా దగ్గర కలిసే వాళ్ళం. ఫిలింనగర్‌కి దూరంగా ఉన్నప్పటికీ.. ఎక్కడైనా ఆడిషన్స్ జరుగుతున్నాయి అని తెలిస్తే చాలు అందరం కలిసి ఒకే బైక్ మీదో లేక ఒకే కారులోనో ఆఫీసులకు వెళ్ళేవాళ్ళం అని తమ గత జ్ఞాపకాలను పంచుకున్నాడు. అలా కష్టపడిన పైకొచ్చిన నోయల్‌కి ఈ 14 సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నట్టు శ్రీవిష్ణు (Actor Srivishnu) చెప్పుకొచ్చాడు.  



Also read : Manchi Rojulochaie Trailer: ‘మంచి రోజులోచ్చాయి’ మూవీ ట్రైలర్‌ రిలీజ్‌


14 మూవీ టీజర్ (14 Telugu movie teaser) రిలీజ్ అనంతరం నోయల్ మాట్లాడుతూ.. శ్రీవిష్ణు రాకతో తమ సినిమాకు మంచి బూస్టింగ్ లభించిందని, ఈ సినిమాతో మంచి సక్సెస్ కొట్టి భవిష్యత్తులో శ్రీవిష్ణుతో కలిసి పని చేసే అవకాశం అందుకుంటాననే నమ్మకం తనకు ఉందని అన్నాడు. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన అనంతరం మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నోయల్‌కు (Bigg Boss contestant Noel Sean) ఈ సినిమా నటుడిగానూ కలిసొస్తుందని అతడి ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు.


Also read : Bheemla Nayak song : భీమ్లా నాయ‌క్ నుంచి మరో సాంగ్‌, ప్రోమో రిలీజ్‌


Also read : Madhura Wines Trailer: మధుర వైన్స్ ట్రైలర్.. మద్యం చుట్టే తిరిగిన ట్రైలర్


Also read : Panchathantram Teaser video: పంచతంత్రం టీజర్ వీడియో చూశారా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook