Madhura Wines Trailer: మధుర వైన్స్ ట్రైలర్.. మద్యం చుట్టే తిరిగిన ట్రైలర్

Madhura Wines Trailer: సన్నీ నవీన్, సీమ చౌదరి (Sunny Naveen, Seema Choudary), సమ్మోహిత్ తూములూరి ప్రధాన పాత్రలు పోషించిన మధుర వైన్స్ మూవీని జయకిషోర్ డైరెక్ట్ చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 13, 2021, 08:14 PM IST
Madhura Wines Trailer: మధుర వైన్స్ ట్రైలర్.. మద్యం చుట్టే తిరిగిన ట్రైలర్

Madhura Wines Trailer: మధుర వైన్స్ ట్రైలర్.. మధుర వైన్స్ ట్రైలర్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. సినిమా టైటిల్ మాదిరిగానే ట్రైలర్ కూడా మద్యం చుట్టే తిరిగిందని చెప్పొచ్చు. ప్రతీ సీన్‌లో లేదా ప్రతీ రెండు మూడు సీన్లకొకసారి మద్యం గురించి డైలాగ్ లేకుండా ట్రైలర్ ఫినిష్ అవలేదు. ఒక ప్రియుడు, ప్రేయసి, మధుర వైన్స్... ఇవే మధుర వైన్స్ ట్రైలర్‌లో ప్రధానంగా కనిపించిన అంశాలు. కాకపోతే మందు బాబులకు, లవ్‌లో పడిన వాళ్లకు మంచి కిక్కెక్కించే డైలాగులు మాత్రం మధుర వైన్స్‌లో (Madhura wines movie) ఉన్నాయనేలా ట్రైలర్‌ను కట్ చేశారు. మధుర వైన్స్, మద్యం డైలాగ్స్, సీన్స్ అని టైమ్ వేస్ట్ చేయడం ఎందుకు కానీ అదేంటో మీరే చూసేయండి.

సన్నీ నవీన్, సీమ చౌదరి (Sunny Naveen, Seema Choudary), సమ్మోహిత్ తూములూరి ప్రధాన పాత్రలు పోషించిన మధుర వైన్స్ మూవీని జయకిషోర్ డైరెక్ట్ చేశాడు. రాజేష్ కొండెపు, సృజన్ యరబోలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న తరుణంలోనే తాజాగా మేకర్స్ మధుర వైన్స్ ట్రైలర్‌ను (Madhura Wines Trailer) విడుదల చేసారు.

Trending News