Diabetes Ayurvedic Tips: ఆధునిక జీవన విధానంలో అత్యంత ప్రమాదకరంగా, వేగంగా విస్తరిస్తున్న వ్యాధి డయాబెటిస్. ఒకసారి సోకిందంటే నియంత్రణే తప్ప పూర్తి నిర్మూలన లేదు. అల్లోపతి కాకుండా ఆయుర్వేద మూలికలు, వైద్య విధానంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ సులభంగా నియంత్రించుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. కేవలం ఐదే ఐదు ఆయుర్వేద చిట్కాలతో సులభంగా డయాబెటిస్ నియంత్రించవచ్చు.
Diabetes Ayurvedic Tips: ఇటీవలి కాలంలో మధుమేహం రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఈ వ్యాధికి ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇండియాలో 18 ఏళ్లు పైబడినవారిలో 7.7 కోట్ల మంది టైప్ 2 డయాబెటిస్తో బాధపడుతున్నారు. 2.5 కోట్ల మంది ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నారట.
మధుమేహం తగ్గించేందుకు ఆయుర్వేద చిట్కాలు ఇటీవలి కాలంలో మధుమేహం వేగంగా వ్యాపిస్తోంది. ప్రతి పదిమందిలో 5 మందికి కచ్చితంగా డయాబెటిస్ ఉండే పరిస్థితి. భవిష్యత్తులో ఈ ముప్పు మరింత పెరగనుంది. డయాబెటిస్ రోగులు బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంచేందుకు ఎప్పుడూ ఆహారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అనారోగ్యకరమైన ఆహారం, చెడు ఆహారపు అలవాట్లు మంచిది కాదు. బ్లడ్ షుగర్ నియంత్రించే 5 ఆయుర్వేద చిట్కాల గురించి పూర్తి వివరాలు ఇలా...
నేరేడు ఆకులు నేరేడు ఆకులు, నేరేడు విత్తనాలు, నేరేడు పండ్లు అన్నీ డయాబెటిస్ వ్యాధిగ్రస్థులకు అద్భుతంగా పనిచేస్తాయి. నేరేడు ఆకులో ఉండే జంబోలన్ అనే పోషక పదార్ధం రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.
వేపాకులు వేపాకులు, విత్తనాలు సేవించడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఇందులో ఉండే నింబిన్ అనే పోషక పదార్ధం చక్కెర శాతాన్ని నియంత్రిస్తుంది.
Hibiscus Tree మందారం చెట్టు ఆకులు మధుమేహం వ్యాధిగ్రస్థులకు చాలా మంచిది. ఇందులో ఉండే ఫెనూలిక్ యాసిడ్ బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గిస్తుంది.
మెంతులు మెంతులు బరువు నియంత్రణతో పాటు డయాబెటిస్ తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుందని చాలా మందికి తెలుసు. రోజూ పరగడుపున తీసుకుంటే అద్భుత ఫలితాలుంటాయి.
కాకరకాయ కాకరకాయ మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఓ వరం లాంటిది. ఇందులో ఉండే చార్యా చాలా ప్రయోజనకరం. బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది.