Sree Reddy: స్వరం మార్చిన శ్రీరెడ్డి.. లోకేష్ అన్నకి విజ్ఞప్తి అంటూ సారీలపర్వం..

Sree Reddy Letter To Lokesh: శ్రీరెడ్డిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. కూటిమి ప్రభుత్వం ప్రముఖులపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గానూ నిన్న పోలీసులు శ్రీరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మంత్రి నారా లోకేష్‌కు ఓ లేఖ రాశారు శ్రీరెడ్డి ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /6

ఏపీ రాజకీయాలు కొత్తరకం టర్న్‌ తీసుకుంది. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ శ్రీరెడ్డి స్వరం మార్చింది. తనపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో లోకేష్‌ అన్నకు విజ్ఙప్తి అంటూ సంచలన లేఖ విడుదల చేసింది.  

2 /6

శ్రీరెడ్డి మంత్రి లోకేష్‌కు లేఖ రాశారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి పై నమోదైన సంగతి తెలిసిందే. టీడీపీ మహిళా నేతలు శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై వారు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మరోసారి ఆమెపై కేసు నమోదు అయింది.ఈ నేపథ్యంలో లోకేష్‌కు శ్రీరెడ్డి సంచలన లెట్టర్‌ రాసింది.  

3 /6

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ లెట్టర్‌లో శ్రీ రెడ్డి మంత్రి లోకేష్ కి విజ్ఞప్తి అంటూ ఆమె సారీ ఇలా పర్వం మొదలుపెట్టింది అందరిని క్షమించమని కోరుతూ సంచలన లేఖను విడుదల చేసింది.  

4 /6

ఇక ఈ సంచలన లెట్టర్‌లో శ్రీరెడ్డి నారా లోకేష్ ను ఉద్దేశిస్తూ అన్న నేను ఎవరిని అవమానించలేదు నా స్వస్థలం విజయవాడ అమరావతి రావడం మాకు ఎంతగానో ఆనందాన్ని కలిగించింది. ఎందుకంటే మా ఆస్తులు కూడా అక్కడే ఉన్నాయి అన్నారు.  

5 /6

ఇకపై తాను ఇలాంటి ఇబ్బందికర పోస్టులు చేయనని, ఎవరైనా నా మాటల వల్ల ఇబ్బంది పడితే వారందరికీ మనస్ఫూర్తిగా క్షమించమని కోరుతున్నట్లు చెప్పారు.దయచేసి మీ అందరూ పెద్దమనసు చేసుకుని మీ తెలుగమ్మాయిని క్షమించండి. అంటూ ఓపెన్‌ లెట్టర్‌ రాశారు. రాజమండ్రి బొమ్మూరు పోలీస్‌ స్టేషన్‌లో శ్రీరెడ్డిపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.   

6 /6

చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, వంగలపూడి అనితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రోద్బలంతో ఈ వ్యాఖ్యలు చేశానని తనను క్షమించమని చెప్పింది.