Kalonji Health Benefits: బ్లాక్ సీడ్స్ లేదా కలోంజీ సీడ్స్ ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం. ప్రాచీన కాలం నుంచి వాడుకలో ఉన్న సీడ్స్ ఇవి. సౌదీ ప్రాంతాల్లో, ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా లభిస్తుంది. కలోంజీ సీడ్స్ రూపంలో లేదా ఆయిల్ రూపంలో తీసుకోవచ్చు.
Kalonji Health Benefits: కలోంజీ ఆరోగ్య ప్రయోజనాల గురించి ఒక ముక్కలో చెప్పాలంటే మరణం తప్ప అన్నింటికీ ఇందులో పరిష్కారముంది. అతిశయోక్తిగా అన్పించినా..నిజమిది. రోజూ పరగడుపున సేవిస్తే చాలా లాభాలున్నాయి. చాలా వ్యాధులు దూరమౌతాయి.
బరువు తగ్గేందుకు స్థూలకాయం సమస్యను పోగొట్టేందుకు కలోంజీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. అయితే రోజూ క్రమం తప్పకుండా పరగడుపున గోరు వెచ్చని నీళ్లలో కలోంజీ ఆయిల్ కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే అధిక బరువు తగ్గించుకోవచ్చు.
చర్మ సంరక్షణ చర్మ సంబంధిత సమస్యలు దూరం చేసేందుకు కలోంజీ విత్తనాలు లేదా కలోంజీ ఆయిల్ అద్బుతంగా ఉపయోగపడుతుంది. కలోంజీ ఆయిల్‌ను నిమ్మరసంతో కలిపి చర్మానికి రాయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది.
గుండె ఆరోగ్యానికి శరీరంలో కీలకమైన, అతి ముఖ్యమైన భాగం గుండె. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కలోంజీ అద్బుతంగా ఉపయోగపడుతుంది. కలోంజీ ఆయిల్‌ను వేడి నీళ్లు లేదా టీలో కలుపుకుని తాగాలి.
ఆరోగ్యం కోసం పికిల్స్, మటర్, పూరీల్లో కలోంజీ కలిపి వండుతారు. కొన్ని రకాల కూరగాయల్లో కూడా కలుపుతారు. ఇందులో చాలా పోషకాలున్నాయి. కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి మూలకాలు చాలా ఉన్నాయి. శరీరానికి ప్రయోజనకరం...
జలుబు నుంచి రక్షణ సీజన్ మారగానే జలుబు, జ్వరం వంటి సమస్యలు వెంటాడుతుంటాయి. అయితే కలోంజీని వేడి చేసి ఆ వాసన చూస్తూ ఉంటే జలుబు నుంచి సులభంగా పరిష్కారం లభిస్తుంది.
డయాబెటిస్ నియంత్రణలో డయాబెటిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధిని నియంత్రించడంలో సైతం కలోంజీ ఆయిల్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. టీలో కలోంజీ ఆయిల్ మిక్స్ చేసి తాగడం వల్ల మంచి ఫలితాలుంటాయి.