/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Clean Chit to Adani Group: దేశంలోని దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీకు చెందిన అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల నేపధ్యంలో వాస్తవాలను తేల్చేందుకు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ నియమించింది. దీనిపై పరిశీలన అనంతరం ప్రపంచవ్యాప్తంగా కుదిపేసిన హిండెన్‌బర్గ్ ఆరోపణల్ని కొట్టిపారేసింది నిపుణుల కమిటీ. అదానీ గ్రూప్‌కు క్లీన్‌చిట్ ఇచ్చేసింది. 

2023 జనవరి 24వ తేదీ అదానీ గ్రూప్‌కు ఓ చీకటి రోజు. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై ఓ నివేదిక వెలువరించింది. ఈ నివేదిక ప్రకారం అదానీ గ్రూప్‌పై ఎక్కౌంటింగ్ మోసాలు, కృత్రిమంగా షేర్ విలువలు పెంచడం, మనీ లాండరింగ్, సూట్‌కేసు కంపెనీలు వంటి తీవ్ర ఆరోపణలున్నాయి. ఫలితంగా ఆ రోజు నుంచి ప్రపంచవ్యాప్తంగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్ విలువ తగ్గుతూ వచ్చింది. ఎంతగా తగ్గిదంటే కేవలం నెలరోజుల్లోనే సగానికి పైగా ఆదానీ సంపదన ఆవిరైపోయింది. అంటే ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానంలో ఉన్న గౌతమ్ అదానీ, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక దెబ్బకు 36వ స్థానానికి పడిపోయారు. ఈ వ్యవహారంపై దేశంలో కలకలం రేగింది. భారీగా ఇన్వెస్టర్లు నష్టపోయారు. పార్లమెంట్‌లో ఈ అంశం పెను దుమారాన్నే లేపింది. ఈ అంశంపై నిగ్గు తేల్చాలని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 

దాంతో ఈ విషయంపై నిగ్గు తేల్చాల్సిందిగా సుప్రీంకోర్టు సెబీ ఆధ్వర్యంలో ఓ నిపుణులు కమిటీని నియమించింది. ఇన్వెస్టర్ల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటోందని ప్రశ్నించింది. ఈ నివేదికపై పరిశీలన జరిపిన సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ హిండెన్‌బర్గ్ నివేదికలో ఆరోపించినట్టుగా ఏ విధమైన తప్పిదాలు జరగలేదని నిర్ధారిస్తూ అదానీ గ్రూప్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది. అదే సమయంలో రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు అదానీ గ్రూప్ తీసుకున్న చర్యల్ని కూడా కమిటీ సమర్ధించింది. హిండెన్‌బర్గ్ నివేదిక చేసిన ఆరోపణలకు తగ్గట్టు ఎలాంటి ఉల్లంఘన జరగలేదని తేల్చింది. అదానీ గ్రూప్ షేర్ ధరల్ని తారుమారు చేయలేదని ప్రాధమిక దర్యాప్తులో తేలినట్టు వెల్లడించింది.

అదానీ గ్రూప్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఇతర పెట్టుబడుల విషయంలో ఏ విధమైన ఉల్లంఘనకు పాల్పడలేదని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. ఇక కృత్రిమ ట్రేడింగ్ కూడా జరిగిందనేందుకు ఆధారాలు లేవని కమిటీ స్పష్టం చేసింది. 

అదానీ గ్రూప్ ఎప్పటికప్పుడు రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడే చర్యలు తీసుకుంటోందని ఇవి స్టాక్ మార్కెట్‌లో నమ్మకాన్ని పెంచేందుకు దోహదపడ్డాయని కమిటీ వివరించింది. గ్రూప్ షేర్లు ఇప్పుడు స్థిరంగా ఉన్నాయని తెలిపింది. ఎక్కౌంటింగ్ ఫ్రాడ్‌కు ఆధారం లేదని తేల్చింది. మొత్తానికి దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక అంశంపై సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ అదానీ గ్రూప్‌కు క్లీన్‌చిట్ ఇవ్వడం ఇప్పుుడు సంచలనంగా మారింది. సెబీ, స్టాక్ ఎక్స్చేంజ్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సుప్రీంకోర్టు నిపుణులు కమిటీ నివేదిక రూపొందించింది. 

Also read: PF Withdrawal Rules: మీ పాత పీఎఫ్ ఎక్కౌంట్లను ఎందుకు విలీనం చేయాలి, లేకపోతే ఏం జరుగుతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Supreme court experts committee of finding facts on hindenburg research report given clean chit to adani group says no accounting or share fraud happened
News Source: 
Home Title: 

Clean Chit to Adani Group: అదానీ గ్రూప్‌కు రిలీఫ్, క్లీన్‌చిట్ ఇచ్చిన నిపుణుల కమిటీ

Clean Chit to Adani Group: అదానీ గ్రూప్‌కు బిగ్ రిలీఫ్, క్లీన్‌చిట్ ఇచ్చిన సుప్రీంకోర్టు నిపుణుల కమిటీ
Caption: 
Supreme court cleanchit Adani group ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Clean Chit to Adani Group: అదానీ గ్రూప్‌కు రిలీఫ్, క్లీన్‌చిట్ ఇచ్చిన నిపుణుల కమిటీ
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Friday, May 19, 2023 - 15:51
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
32
Is Breaking News: 
No
Word Count: 
340