Independence Day 2023: 95 ఏళ్ల వయస్సులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎల్ కే అద్వానీ

Independence Day 2023: ఇవాళ ఆగస్టు 15 దేశం మొత్తం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. దేశంలోని ఊరూరా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. దేశ ప్రధాని మోదీ నుంచి ఊర్లోని సామాన్యుడి వరకూ అంతా పతాకావిష్కరణ చేస్తున్నారు. సంబరాలు జరుపుకుంటున్నారు.
 

Independence Day 2023: దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ మాజీ అధ్యక్షుడు లాల్‌కృష్ణ అద్వానీ తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నాటి స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకున్న నేతల్ని స్మరించుకున్నారు.

1 /5

లాల్ కృష్ణ అద్వానీ 2002 నుంచి 2004 వరకూ దేశ ఉప ప్రధానిగా ఉన్నారు. అంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చాలాకాలం పనిచేశారు. దేశంలో బీజేపీ ఉనికికి కారణం ఈయనే

2 /5

అద్వానీతో పాటు జాతీయ పతాకావిష్కరణలో కుటుంబసభ్యులతో పాటు కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు.  

3 /5

లాల్‌కృష్ణ అద్వానీ వయస్సు ఇప్పుడు 95 ఏళ్లు. ఇప్పటికీ కుమార్తెతో కలిసి జాతీయ పతాకావిష్కరణలో పాల్గొన్నారు.

4 /5

ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని జెండా ఎగురవేసేటప్పుడు అద్వానీ వెంట ఆయన కుమార్తె ఉంది. 

5 /5

దేశ మాజీ ఉప ప్రధాని లాల్‌కృష్ణ అద్వానీ ఇవాళ తన ఇంట్లో కుటుంబసభ్యుల సమక్షంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్య్ర వేడుకలు జరుపుకున్నారు.