Chandrayaan 3: చంద్రయాన్ 3 విజయవంతం, విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ ఫోటోలు మీ కోసం

Chandrayaan 3: అసాధ్యం సుసాధ్యమైంది. చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారిగా కాలు మోపింది విక్రమ్ ల్యాండర్. చంద్రయాన్ 3 విజయవంతమైంది. ఇస్రో కీర్తి శిఖరానికి చేరింది. 

Chandrayaan 3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్ర లిఖించింది. ఊహించినట్టే సరిగ్గా 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై విజయవంతంగా కాలుమోపింది. అగ్రరాజ్యాలు సైతం చేతులెత్తేసిన దక్షిణ ధృవంపై తొలిసారి అడుగుపెట్టిన దేశంగా ఇండియా ఖ్యాతినార్జించింది. ఆ దృశ్యాలు మీ  కోసం...

1 /9

2 /9

3 /9

చంద్రయాన్ 2 విఫలమైనా చంద్రయాన్ 3కు శ్రీకారం చుట్టి విజయం సాధించింది. చంద్రుని మిషన్ లో అగ్రరాజ్యం అమెరికా ఇప్పటి వరకూ 26 సార్లు విఫలం కాగా రష్యా 14 సార్లు వైఫల్యం చెందింది. 

4 /9

41 రోజుల ప్రయాణం తరువాత చంద్రుని దక్షిణ ధృవంపై విజయవంతంగా అడుగుపెట్టింది

5 /9

ఇవాళ అంటే ఆగస్టు 23 సాయంత్రం 5.47 గంటలకు ప్రారంభమైన సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ...17 నిమిషాల టెర్రర్ సమయాన్ని దాటుకుని విజయవంతంగా అడుగెట్టింది. 

6 /9

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్ర లిఖించింది. ఊహించినట్టే సరిగ్గా 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై విజయవంతంగా కాలుమోపింది. అగ్రరాజ్యాలు సైతం చేతులెత్తేసిన దక్షిణ ధృవంపై తొలిసారి అడుగుపెట్టిన దేశంగా ఇండియా ఖ్యాతినార్జించింది.

7 /9

ఆగస్టు 1న చంద్రుని కక్ష్యలో ప్రవేశపెట్టాక అక్కడి నుంచి చంద్రుని వైపుకు పరిభ్రమించసాగింది. క్రమ క్రమంగా చంద్రుని కక్ష్యలో దూరం తగ్గించుకుంటూ వెళ్లింది. ఆగస్టు 17న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌లు ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా విడిపోయాయి.

8 /9

జూలై 14న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన చంద్రయాన్ 3 అనుకున్న సమయానికి ఆగస్టు 23 సాయంత్రం సరిగ్గా 6.04 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది.

9 /9

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. జాతీయ జెండా ఉపి దేశ ప్రజలకు శుభాకాంక్షలు అందించారు. ఇవాళ మనమంతా ఓ అద్భుతం కళ్లారా చూశామని..చంద్రయాన్ 3 సక్సెస్‌తో తన జీవితం ధన్యమైందన్నారు.