Curry Leaves Water: సాధారణంగా కరివేపాకు వినియోగం దక్షిణాది ప్రజలే ఎక్కువగా చేస్తుంటారు. ఆరోగ్యపరంగా అద్భుతమైంది. ఎన్నెన్ని ప్రయోజనాలున్నాయో లెక్కలేదు. ఎక్కువగా తాలింపులో ఉపయోగిస్తుంటారు. రుచి, సువాసన కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే కరివేపాకుల్ని నీళ్లలో ఉడికించి తాగితే రక్త హీనత, వికారం వంటి సమస్యలు తొలగిపోతాయి. పెద్దఎత్తున యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో కేశాలకు కూడా మంచిది. కరివేపాకుతో కలిగే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి.
వెయిట్ కంట్రోల్ రోజూ ఉదయం పరగడుపున కరివేపాకుల్ని నీళ్లలో ఉడకబెట్టి తాగడం వల్ల బరువు నియంత్రణలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. ఒత్తిడి , ఆందోళన కూడజా తగ్గుతాయి.
డీటాక్స్ మరియు డయాబెటిక్ నియంత్రణ కరివేపాకుల్ని ఉడకబెట్టి తాగడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. రోజూ తాగడం అలవాటు చేసుకుంటే శరీరంలో ఉండే హానికారక పదార్ధాలు తొలగిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. దాంతోపాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి. డయాబెటిస్ రోగులకు అద్భుతంగా పనిచేస్తుంది.
వికారం చలికాలంలో మార్నింగ్ సిక్నెస్ లేదా వికారం సమస్య ఎక్కువగా ఉంటుంది. రోజూ కరివేపాకు నీళ్లను తాగడం వల్ల ఈ సమస్య పోతుంది. వికారం, విరేచనాలు సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
రక్తహీనత దూరం కరివేపాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. నిర్ణీత మోతాదులో సేవించడం వల్ల ఎనీమియా దూరమౌతుంది. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
ఇమ్యూనిటీ బూస్ట్ కరివేపాకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బయోటిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కరివేపాకుల్ని నీళ్లలో ఉడకబెట్టి రోజూ ఉదయం తాగడం వల్ల శరీరం రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు దూరమౌతాయి.