Rasi Phalalu Telugu: కుజ గ్రహం సంచారంతో ఈ రాశులవారికి లైఫ్ సెట్‌ అవ్వబోతోంది!

Rasi Phalalu Telugu: అతి త్వరలోనే కుజ గ్రహం సంచారం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఊహించని లాభాలతో పాటు నిలిపోయిన పనులు సులభంగా జరుగుతాయి. అంతేకాకుండా కొన్ని వివాదాల నుంచి కూడా బయట పడతారు. 

  • Dec 14, 2023, 13:53 PM IST


Rasi Phalalu Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలలో ఏదో ఒక గ్రహం సంచారం చేస్తునే ఉంటుంది. దీని కారణంగా మొత్తం 12 రాశులవారిపై ప్రభావం పడుతుంది. డిసెంబర్ 27వ తేదీ రాత్రి 11:40 గంటలకు కుజుడు ధనుస్సు రాశిలోకి సంచారం చేయబోతోంది. 
 

1 /5

కుజ గ్రహం కొన్ని రాశులవారికి జాతకంలో 12 స్థానంలో సంచారం చేస్తే మరికొన్ని రాశులవారి జాతాకాల్లో 4వ స్థానంలో సంచారం చేయబోతోంది. అయితే దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం కారణంగా వ్యక్తిగత జీవితాల్లో ఊహించని మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.    

2 /5

కుజ గ్రహం సంచార ప్రభావం కారణంగా కొన్ని రాశులవారు లాభాలు పొందితే..మరికొన్ని రాశులవారు తీవ్ర ఇబ్బందులు పడతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే అతి త్వరలోనే జరగబోయే ఈ కుజ గ్రహ సంచారం కారణంగా ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

3 /5

కుజ గ్రహం సంచారం కారణంగా మకర రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలిగే ఛాన్స్‌లు ఉన్నాయి. దీంతో పాటు వీరు విదేశాలకు వెల్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య కొనసాగుతున్న వివాదాలు కూడా సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు.   

4 /5

కర్కాటక రాశి వారికి కుజ గ్రహం సంచారం కారణంగా ఏర్పడే పరివర్తన్ రాజయోగం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఏళ్ల తరబడి నిలిచిపోయిన పనులు సులభంగా జరుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా మంచి లాభాలు పొందుతారు.  

5 /5

పరివర్తన్ రాజయోగం కారణంగా కుంభ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ సులభంగా నెరవేరుతాయి. అంతేకాకుండా పిల్లల నుంచి కూడా శుభవార్తలు అందుకుంటారు.