Latest Sankranthi Muggulu 2024: కొత్త డిజైన్ కలిగిన ముగ్గులను ఈ సంక్రాంతికి మీ ఇంటి ముందు వేయాలనుకుంటున్నారా? మీ కోసం జీ తెలుగు న్యూస్ వెబ్సైట్ ప్రత్యేక స్టోరిని అందిస్తోంది. దీని ద్వారా సులభంగా ముగ్గులు వేయోచ్చు.
Latest Sankranthi Muggulu 2024: కొత్త సంవత్సరంలో ముందుగా వచ్చే పండగల్లో సంక్రాంతి ఒకటి..ఈ పండగ ప్రతి సంవత్సరం జనవరి నెలలో వస్తుంది. అందరూ ఈ పండగను మకర సంక్రాంతిగా కూడా పిలుస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల సంక్రాంతి పండగకి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. అయితే ఈ పండగను తెలుగు రాష్ట్రాలు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు మహిళలంతా ఉదయాన్నే నిద్రలేచి ముగ్గులు వేస్తారు. అయితే మీరు కూడా మీ వాకిలి నిండా ముగ్గులతో నింపాలనుకుంటున్నారా? ఈ గ్యాలరీలో మీ కోసమే..
మకర సంక్రాంతి సందర్భంగా జీవితం రంగులమయం కావాలని ఆ సూర్యభగవానుడిని కోరకుంటూము. దీని కోసం ఆ సూర్యదేవుడిని ఆహ్వానించేందుకు మీ ఇంటి వాకిలిలో ఈ అందమైన ముగ్గు వేయండి..
ప్రస్తుతం చాలా మంది చుక్కల ముగ్గులను వేసేందుకే ఇష్టపడతారు. అయితే ఇలాంటి వారి కోసం ఈ ప్రత్యేక డిజైన్..ఈ డిజైన్తో సులభంగా మీ ఇంటి ముందు పెద్ద ముగ్గును వేసుకోవచ్చు.
మకర సంక్రాంతి రోజు లక్ష్మీ దేవి అనుగ్రహం లభించడానికి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఈ ప్రత్యేకమైన ముగ్గును వేయండి..
ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కష్టాలను తొలగించి..సకలశుభాలను నింపాలని కోరకుంటూ..మీ ఇంటి ముందు సంక్రాంతి శుభాకాంక్షలతో తెలిపిన ముగ్గులను వేయండి.
ఈ సంక్రాంతి పూట విరిసిన పువ్వులను పెద్ద పెద్ద ముగ్గుల రూపాల్లో మీ ఇంటి ముందు వేసి లక్ష్మీ దేవిని ఆహ్వానించండి.