Makara Jyothi 2024: శబరిమల అయ్యప్ప "మకర జ్యోతి" దర్శనం..మీరు దర్శించుకోండి ఇలా..

Makara Jyothi 2024: ఎందరో అయ్యప్ప భక్తులే ఎదురు చూస్తున్న అయ్యప్ప మకర జ్యోతి దర్శనం జరిగింది. ఈ సంవత్సరం మకర జ్యోతి దర్శనం 6 నుంచి 7 గంటల వ్యవధిలో ఏర్పాటు చేసింది ఆలయ బోర్డు. మీరు కూడా మకర జ్యోతి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు? 


Makara Jyothi 2024: దేశవ్యాప్తంగా శబరిమల భక్తులకు మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. శబరిమలలోని పొన్నెంబలమెడపై అయ్యప్ప భక్తులకు మకర జ్యోతి ఈ సంవత్సరం మూడుసార్లు దర్శనమిచ్చింది. ఈ సమయంలో అయ్యప్ప నామస్వరనతో శబరిమల కొండ మార్మోగింది. ఈ సంవత్సరం మకర జ్యోతి దర్శనాన్ని 3 లక్షల మందికిపైగా కొండపై నుంచి అయ్యప్ప భక్తుల దర్శించుకున్నారు. మీరు కూడా మకరజ్యోతి దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే..
 

1 /6

ఈ సంవత్సరం శబరిమల కొండపై సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అయ్యప్ప మకర జ్యోతి దర్శనం ఇచ్చింది. ఈ సమయంలో భక్తులంతా అయ్యప్ప నామస్మరణతో మకర జ్యోతిని దర్శించుకున్నారు.  

2 /6

ప్రతి సంవత్సరం శబరిమల మకర జ్యోతి సంక్రాంతి రోజున దర్శనమిస్తుంది. కాబట్టి దీనిని భక్తులు శబరిమల మకరవిళ్ళక్కు లేదా మకర జ్యోతిగా పిలుస్తారు. ఏడాది మకర సంక్రాంతి రోజు ఈ జ్యోతి దర్శనం కోసం లక్షలాదిమంది శబరిమల కొండపైకి తరలివస్తారు.  

3 /6

ప్రతి సంవత్సరం మకర జ్యోతి ఘట్టం రెండు నుంచి మూడు నిమిషాల వ్యవధిలో జరుగుతుంది. ఈ సంవత్సరం జనవరి 15 తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో అయ్యప్ప మకర జ్యోతి దర్శనం ఇచ్చింది.

4 /6

ప్రతి సంవత్సరం శబరిమల ఆలయ బోర్డు ప్రతి సంవత్సరం ఈ మకర జ్యోతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది ఈ మకర జ్యోతి దర్శనం కేవలం మూడుసార్లు మాత్రమే దర్శనమిస్తుంది. ఇదే సమయంలో మాత్రమే మకర జ్యోతి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.  

5 /6

ఈ సంవత్సరం భక్తులకు ఎలాంటి లోటు రాకుండా, ఇబ్బందులు తలెత్తకుండా శబరిమల ఆలయ బోర్డు వివిధ ప్రాంతాల్లో 4000 మంది పోలీసులతో బందోబస్తున ఏర్పాటు చేసింది. అంతేకాకుండా కొన్ని కొండ ప్రాంతాల్లో భక్తుల కోసం త్రాగునీరును, వైద్య సదుపాయాలను కూడా అందిస్తోంది.  

6 /6

మకర జ్యోతిని దర్శించుకోవడం చాలా అదృష్టం. ఈ మకర జ్యోతిని దర్శించుకోవడం వల్ల అదృష్టం తో పాటు మంచి ఆరోగ్యం సమాజంలో శ్రేయస్సు లభిస్తుందని అయ్యప్ప భక్తుల నమ్మకం. అంతేకాకుండా జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయట.