Roya Family Diagnosed with Cancer: క్యాన్సర్ వ్యాధి బ్రిటిష్ రాజ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడుతోంది. తాజాగా ప్రస్తుత రాజు చార్లెస్ III కూడా ఈ వ్యాధితోనే బాధపడుతున్నారు.ప్రోస్టేట్ చికిత్స కోసం లండన్ క్లినిక్‌లో చేరిన వారం తర్వాత కింగ్ చార్లెస్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారని బకింగ్‌హామ్ ప్యాలెస్ తెలియజేసింది.
King charles III.. కింగ్ చార్లెస్ III పూర్తి పేరు చార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్. ఈమర 1948 నవంబర్ 14న జన్మించాడు. అతను తన తల్లి క్వీన్ ఎలిజబెత్ II మరణం తర్వాత 8 సెప్టెంబర్ 2022న బ్రిటన్‌కు రాజయ్యాడు. ఫిబ్రవరి 2024 ఓ నివేదిక అతనికి క్యాన్సర్ ఉన్నట్లు వెల్లడించింది.
ఎలిజబెత్ బోజ్ లియాన్.. ఎలిజబెత్ బోవెస్-లియాన్, క్వీన్ మదర్ అని కూడా పిలుస్తారు. క్వీన్ ఎలిజబెత్ II తల్లి. ఆమె తన 101 సంవత్సరాల వయస్సులో 2002 లో కేన్సర్ తో మరణించారు.
కింగ్ ఎడ్వర్డ్ VII.. కింగ్ ఎడ్వర్డ్ VII పాలన 1901 -1910 వరకు ఉంది. అతను రోడెంట్ అల్సర్‌తో బాధపడ్డాడు.
కింగ్ ఎడ్వర్డ్ VIII .. ది డ్యూక్ ఆఫ్ విండ్సర్ అని కూడా పిలువబడే కింగ్ ఎడ్వర్డ్ VIII 1971లో గొంతు క్యాన్సర్‌తో బాధపడ్డాడు.
కింగ్ జార్జ్ VI.. కింగ్ జార్జ్ VI పదవీకాలం 1936 -1952 మధ్య ఉంది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం జార్జ్ ఎక్కువగా చైన్ స్మోకర్. దాని వల్ల అతనికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది.
క్వీన్ విక్టోరియా.. క్వీన్ విక్టోరియా.. ప్రిన్స్ ఆల్బర్ట్ కుమార్తె ప్రిన్సెస్ విక్టోరియా. 1898 సంవత్సరంలో రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయింది, ఆ తర్వాత ఆమె చాలా కాలం పాటు మంచాన పడింది. తర్వాత క్యాన్సర్ ఆమె వెన్నెముకకు వ్యాపించిం 60 సంవత్సరాల వయస్సులో 1901 ఆగస్టు 5న మరణించింది.
సారా ఫెర్గూసన్.. ది డచెస్ ఆఫ్ యార్క్ అని కూడా పిలువబడే సారా ఫెర్గూసన్, జూన్ 2023లో తనకు రొమ్ము క్యాన్సర్ ఉందని, ఆ తర్వాత ఆమెకు ఒకే మాస్టెక్టమీ జరిగిందని వెల్లడించింది. ఆ తర్వాత జనవరి 2024లో అతనికి మాలిగ్నెంట్ మెలనోమా అనే మరో రకం క్యాన్సర్ ఉన్నట్లు గుర్తించారు.