Aadhar Card: ఆధార్‌ కార్డులో ఎన్నిసార్లు మీ పేరు అడ్రస్‌ మొబైల్‌ నంబర్‌ మార్చుకోవచ్చు.. పూర్తి వివరాలు

Aadhar Card Update: భారతీయులుగా ఆధార్ కార్డు మనకు ఎంతో ముఖ్యం. దీని ఓ గుర్తింపు కార్డుగా ఉపయోగిస్తారు, ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు కలిగి ఉండాల్సిందే. అయితే ఇటీవలే పదేళ్లు దాటిన ఆధార్ కార్డులో అప్డేట్ చేయాలని కేంద్రీ ప్రభుత్వం సూచించింది. అయితే ఆధార్ కార్డును మనం ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు?.
 

1 /7

UIDAI ఇటీవల పదేళ్లు ఆధార్ కార్డు ప్రతి ఒక్కరూ అదే దాటినవి అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే అవి పని చేయమని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆధార్ కార్డు అనేది మనదేశంలో గుర్తింపు కార్డు ప్రతి ఒక్కరు కలిగి ఉండాల్సిందే. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఈ ఆధార్ కార్డుతో అన్ని లావాదేవీలు జరుగుతాయి. ముఖ్యంగా బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడానికి స్కూల్, కాలేజీలో కూడా ఆధార్ కార్డు ఎంతో ముఖ్యం.  

2 /7

అయితే ప్రతి పదేళ్లకు ఒకసారి ఆధార్ కార్డును అప్డేట్ చేస్తూ ఉండాలి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని యూఐడీఏఐ ఈ ఆధార్ కార్డు అప్డేట్ సమయాన్ని 2024 డిసెంబర్ 14 వరకు పెంచింది. మీరు కూడా మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయండి లేకపోతే అది పనిచేయకుండా పోతుంది.  

3 /7

యుఐడిఏఐ జారీ చేసే ఈ ఆధార్ కార్డులో మన వివరాలు కలిగి ఉంటుంది. ఇందులో ఏవైనా తప్పులు ఉంటే మన పేరు అడ్రస్ ఫోన్ నెంబర్ వంటివి మార్పులు చేసుకునే సౌకర్యం ఉంది. అయితే ఒక్కో దానికి ఒక నిబంధన కలిగి ఉంది.  

4 /7

ఒకవేళ మీరు మీ పుట్టిన తేదీని మార్పు చేయాలనుకుంటే కేవలం ఒక్కసారి మాత్రమే చేయాలి. మీ పేరు ఏదైనా మార్పులు చేయాలనుకుంటే రెండు సార్లు చేయవచ్చు. అయితే మీ ఫోన్ నెంబర్లు ఇంటి అడ్రస్ లో మాత్రం ఎలా ఎన్ని సార్లు అయినా మార్పులు చేసుకోవచ్చు.  

5 /7

మీరు ఇల్లు మారినప్పుడు లేదా మొబైల్ నెంబర్ మార్పులు జరిగినప్పుడు ఆధార్ కార్డులు కూడా వెంటనే అప్డేట్ చేసుకునే సౌకర్యం ఉంది. ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకోవడానికి ఉచిత సౌకర్యం వచ్చే నెల డిసెంబర్ 14 వరకు ఉంది. వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.  

6 /7

ఒకవేళ మీ పుట్టిన చేతిలో ఏమైనా మార్పులు చేసుకోవాలంటే దానికి సంబంధించిన పదో తరగతి సర్టిఫికెట్ లేదా మీ డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఏ మార్పులు చేయాలన్నా దానికి సంబంధించిన పత్రాలు అప్లోడ్ చేయాలి.  

7 /7

మీరు అప్డేట్ చేయాలనుకున్నా రిక్వెస్ట్ ఒక నెల సమయం పడుతుంది. ఒక్కోసారి మూడు నెలలు కూడా సమయం పడుతుంది. ఎందుకంటే అప్డేట్ చేయడంలో ఏమైనా సమస్యలు ఉంటే సమయం పెరుగుతుంది. హెల్ప్ లైన్ నెంబర్ 1947 నెంబర్ కి కాల్ చేయాలి. లేకపోతే మీ దగ్గరలోని ఆధార్ నమోదు సెంటర్ కి వెళ్లి సంప్రదించండి