/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Fasting Tips for Diabetes: ఇటీవలి కాలంలో మధుమేహం కేసులు పెరిగిపోతున్నాయి డయాబెటిస్ రోగులు ఎప్పటికప్పుడు మందులు వాడటం, డైట్ తీసుకోవడం చేస్తుండాలి. లేకపోతే బ్లడ్ షుగర్ లెవెల్ చెడిపోతుంది. దాంతో ఇతర అనారోగ్య సమస్యలు ఎదురౌతాయి. అలాంటప్పుడు రంజాన్ నెలలో ఉపవాసాలు ఉండేటప్పుడు మధుమేహం వ్యాధిగ్రస్థులు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి.

దేశవ్యాప్తంగా రంజాన్ నెల ఇవాళ్టి నుంచి ప్రారంభమైంది. ఇస్లాం మతంలో అత్యంత పవిత్రమైన నెల. పవిత్ర ఖురాన్ అవతరించిన నెలకావడంతో విధింగా 30 రోజులు కఠిన ఉపవాస దీక్ష ఆచరిస్తారు. రోగులకు మాత్రం ఉపవాసాల నుంచి మినహాయింపు ఉంటుంది. మరి మధుమేహం వ్యాధిగ్రస్తుల పరిస్థితి ఏంటి, ఉపవాసాలు ఉండవచ్చా లేదా అనే సందేహం ఉంటుంది. ఎందుకంటే మధుమేహం వ్యాధిగ్రస్థులు సమయానికి తిండి తినడం చాలా అవసరం. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మధుమేహం వ్యాధిగ్రస్థులు కూడా ఉపవాసాలు ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

ముఖ్యంగా నిద్ర విషయంలో రాజీ పడకూడదు. మధుమేహం వ్యాధిగ్రస్థులు రోజూ తగినంత నిద్ర తప్పకుండా తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఉపవాసాలుండేటప్పుడు నిద్ర తక్కువ కాకుండా చూసుకోవాలి. నిద్ర సరిగ్గా ఉంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. అజీర్తి సమస్యలుండవు. సూర్యోదయానికి ముందు తినే సహరీ సమయంలో ప్రో బయోటిక్స్ ఉండే పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలి. దీనివల్ల ఎసిడిటి వంటి సమస్యలు ఉత్పన్నం కావు. సహరీ సమయంలో బ్యాలెన్స్ డైట్ అవసరం. ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, రోటీ, పాలు వంటివి ఉండేట్టు చూసుకోవాలి.

ఇక సాయంత్రం ఉపవాసం విడిచే సమయం ఇఫ్తార్ లో షుగర్ ఫ్రీ డ్రింక్స్ తీసుకుంటే మంచిది. ఫ్యాట్ ఎక్కువగా ఉండే సమోసా, కబాబ్, పూరీ వంటివి తీసుకోకూడదు. ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్, స్కిన్‌లెస్ చికెన్, చేపలు వంటివి తీసుకోవచ్చు. ఉవవాసం ఉండేవారిలో సాధారణంగా డీహైడ్రేషన్ సమస్య ఉత్పన్నం కావచ్చు. మరీ ముఖ్యంగా డయాబెటిస్ రోగులకు ఈ ఇబ్బంది ఏర్పడవచ్చు. అందుకే నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, దోసకాయ, పుచ్చకాయ, రోజ్ డ్రింక్ వంటివి తీసుకోవాలి. 

అన్నింటికంటే ముఖ్యంగా ఎప్పటికప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్షిస్తుండాలి. తేడా అన్పిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. షుగర్ లెవెల్స్ మరీ ఎక్కువగా ఉండేవాళ్లు మాత్రం వైద్యుని సలహాతో ఉపవాసాలుంటే మంచిది.

Also read: Quitting Smoking: అకస్మాత్తుగా స్మోకింగ్ మానేస్తే..ఇది తెలుస్తే షాక్‌ అవుతారు.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Ramadan Fastings and diabetic patients do they continue fastings or not, what are the precautions to be taken rh
News Source: 
Home Title: 

Fasting Tips for Diabetes: మధుమేహం ఉంటే ఉపవాసాలుండవచ్చా, ఏయే జాగ్రత్తలు తీసుకోవాల

Fasting Tips for Diabetes: మధుమేహం ఉంటే ఉపవాసాలుండవచ్చా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Caption: 
Ramadan Fasting Diet ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Fasting Tips for Diabetes: మధుమేహం ఉంటే ఉపవాసాలుండవచ్చా, ఏయే జాగ్రత్తలు తీసుకోవాల
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Tuesday, March 12, 2024 - 17:06
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
17
Is Breaking News: 
No
Word Count: 
284