RBI Credit Card Rules: క్రెడిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త. ఆర్బీఐ క్రెడిట్ కార్డు నియమాల్లో చేసిన మార్పులతో క్రెడిట్ కార్డు హోల్డర్లకు బిగ్ రిలీఫ్ అని చెప్పవచ్చు. బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా కట్టడి చేస్తోంది ఆర్బీఐ.
క్రెడిట్ కార్డు కంపెనీలు సాధారణంగా కస్టమర్లు ఓ టైమ్ ఇస్తాయి. కార్డు ద్వారా చేసిన ఖర్చుల్నింటినీ కలిపి ఓ నిర్ణీత తేదీన బిల్లు జారీ చేస్తుంది. బిల్ జనరేట్ చేసిన తరువాత డ్యూ డేట్ లోగా ఆ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే బిల్లింగ్ సైకిల్. ఇప్పుడిక బిల్లింగ్ తేదీని కస్టమర్లు ఎంచుకోవచ్చు.
నచ్చిన కార్డు ఎంచుకోవడమే కాకుండా క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్ కూడా ఎంచుకోవచ్చు. తమకు నచ్చిన తేదీల్లో బిల్లింగ్ సైకిల్ ఉండేట్టు చేసుకోవచ్చు. కస్టమర్ల వద్ద బిల్లింగ్ సైకిల్ ఎంచుకునే ఆప్షన్ ఉండాలి.
బ్యాంకులు లేదా క్రెడిట్ కార్డులు జారీ చేసే నాన్ బ్యాంకింగ్ సంస్థలు క్రెడిట్ కార్డు మంజూరు చేసేటప్పుడు వేర్వేరు ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే కార్డు వినియోగిస్తుంటే రెన్యువల్ సమయంల ఆప్షన్ ఎంచుకునే అవకాశం కల్పించాలి.
ఆర్బీఐ ఇటీవలే ఓ సర్క్యులర్ జారీ చేసింది. తమకిష్టమైనట్టుగా కార్డు నెట్వర్క్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. వీసా, మాస్టర్ కార్డ్, అమెరికన్ ఎక్స్ప్రెస్, రూపే ఇలా ఏది కావలిస్తే అది ఎంచుకోవచ్చు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డు నియమాల్ని మార్చేసింది. బ్యాంకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా కట్టడి చేసింది. ఇప్పుడిక కస్టమర్లు తమకిష్టమైన క్రెడిట్ కార్డు ఎంచుకునే వెసులుబాటు కలుగుతుంది. కొత్త నియమాల ప్రకారం ఇష్టపూర్వకంగా నచ్చిన క్రెడిట్ కార్డు ఎంచుకోవచ్చు. బిల్లింగ్ సైకిల్ కూడా తమకు నచ్చినట్టుగా ఎంచుకోవచ్చు. అంటే బిల్లింగ్ డేట్ మార్చుకోవచ్చు.