Chanakya Niti: చాణక్యుడు నిజ జీవితంలో మనం ఎదుర్కొనే కొన్ని విషయాలను పంచుకున్నాడు. ముఖంగా చాణక్య నీతిలో ఈ విషయాలను పొందుపరిచాడు. మనిషి నిత్య జీవితంలో చేస్తున్న తప్పులను ఎలా సరిదిద్దుకోవాలో.. ఎలా నడుచుకోవాలో కూడా వివరించాడు.
Chanakya Niti: ఆయన చెప్పిన విషయాలు కచ్చితంగా మన నిత్య జీవితంలో ఎదురయ్యేటివే. అయితే, ఆచార్య చాణక్యుడు మగవాళ్లు ఎలాంటి ఆడవాళ్లను పెళ్లి చేసుకోవాలో కూడా వివరించాడు. ముఖ్యంగా ఇలాంటి స్త్రీని పెళ్లి చేసుకోవడం వల్ల అతనికి అదృష్టం కలిసి వస్తుందని చెప్పాడు.
ధైర్యవంతురాలు.. ధైర్యవంతురాలైన స్త్రీ ని పెళ్లి చేసుకుంటే అతని ఎల్ల వేళలా తోడుంటుంది. అతనికి, కుటుంబానికి కూడా ధైర్యాన్ని పంచుతుంది. అందుకే చాణక్య నీతి ప్రకారం ధైర్య వంతులరాలైన స్త్రీ ని పెళ్లి చేసుకోవాలట..
గౌరవం.. ఎప్పటికైనా పెద్దలకు గౌరవించేవారు అందరితోనూ గౌరవప్రదంగా నడుచుకుంటారు. అందుకే ఏ స్త్రీ అయితే, పెద్దలను గౌరవిస్తుందో అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలట. ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మీ ఇంట సంపద రెట్టింపు అవ్వడం కాకుండా లక్ష్మి కటాక్షం కూడా ప్రాప్తిస్తుందట.
పూజలు.. చాణక్య నీతి ప్రకారం ఒక స్త్రీ తన మతాన్ని అనుసరించి అన్ని పూజ కార్యక్రమాలు నిర్వహించాలి. ఇటువంటి స్త్రీ ఉంటే అతనికి సంపద పెరుగుతుంది. లక్ష్మి కటాక్షం కూడా కలుగుతుంది. ఆచార నియమాలను పాటించే స్త్రీ ఎప్పటికైనా కుటుంబానికి పిల్లలకు ఆదర్శప్రాయం..
నెమ్మదస్తురాలు.. చాణక్య నీతి ప్రకారం నెమ్మదస్తురాలైన స్త్రీని పెళ్లి చేసుకుంటే ఏ గొడవలు జరిగినా తన సర్ది చెప్పే విధంగా ఉంటుంది.
మనస్సు.. ముఖ్యంగా చాణక్య నీతి ప్రకారం భర్త మనస్సు ఎరిగిన స్త్రీ ని పెళ్లి చేసుకోవాలట. ఆమె తన భర్త ఏ కష్టాల్లో ఉన్నా చెప్పకనే తెలుసుకుంటుంది. తన ప్రవర్తన కూడా అతడి మనస్సును బట్టి నడుచుకుంటుంది. అందుకే ఇతరుల మనస్సు తెలిసిన స్త్రీని పెళ్లి కోవాలని చాణక్యుడు చెబుతాడు..(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)