Avakaya Pappu Recipe: చాలామంది తరచుగా ఆవకాయతో తింటూ ఉంటారు. అయితే ఇలాంటి వారి కోసం ఒక ప్రత్యేకమైన రెసిపీని పరిచయం చేయబోతున్నాం. అదేంటో కాదు ఆవకాయ పోపు అన్నం.. మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారా?
Avakaya pappu recipe: ప్రతిరోజు చాలామంది ఇంట్లో నుంచి తెచ్చుకుని లంచ్ బాక్స్ లో ఏదైనా ఒక కొత్త రెసిపీ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ప్రతిరోజు ఏదో ఒక కొత్త రెసిపీని పిల్లలకు, ఆఫీస్ కి వెళ్లే వారికి లంచ్ బాక్స్ లో ఇస్తూ ఉంటారు. అయితే చాలామందికి ఒకే రకం కూరలు, రైస్ తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలైతే ఒకే రకమైన వంటకాలు తినేందుకు అంతగా ఆసక్తి చూపరు. అయితే ఇలాంటి వారి కోసం ఒక ప్రత్యేకమైన రెసిపీని పరిచయం చేయబోతున్నాం. అదేంటో కాదు అందరి ఇళ్లల్లో ఉండే ఆవకాయతో పోపు అన్నం. చాలామంది ఎక్కువగా లెమన్ రైస్, జీరా రైస్ చేసుకుంటూ ఉంటారు. ఇవి తిని తిని చాలా వరకు బోర్ కొడుతూ ఉంటుంది. అయితే ఈ ఆవకాయ పోపు రైస్ ఒక్కసారి ట్రై చేస్తే వదలకుండా మళ్లీమళ్లీ తింటూ ఉంటారు. ఈ రెసిపీలో ఆవకాయలో ఉండే రుచి రైస్ కి పట్టి మంచి ఫ్లేవర్ ను అందిస్తుంది. అంతేకాకుండా హెల్తీగా ఉండడానికి ఇందులో క్యారెట్ ని కూడా వినియోగించవచ్చు. అయితే మీరు కూడా ఇంట్లో ఈ కొత్త రెసిపీని తయారు చేసుకోవాలనుకుంటున్నారా? మీకోసం అతి సులభమైన పద్ధతిలో ఆవకాయ పోపు రైస్ తయారీ విధానాన్ని పరిచయం చేయబోతున్నాం.
ఆవకాయ పోపు రైస్ తయారీకి కావలసిన పదార్థాలు: 2 కప్పుల ఉడికించిన అన్నం, 1/2 కప్పు ఆవకాయ ముక్కలు, 1/4 కప్పు నూనె, 1/2 టీస్పూన్ ఆవాలు, 1/2 టీస్పూన్ జీలకర్ర
1 టేబుల్ స్పూన్ కరివేపాకు, 2 పచ్చిమిర్చి ముక్కలు, తరిగినవి, 1/2 టీస్పూన్ పసుపు, 1/2 టీస్పూన్ శొంఠి-వెల్లుల్లి పేస్ట్
1/4 టీస్పూన్ ధనియాల పొడి, 1/4 టీస్పూన్ గరం మసాలా, ఉప్పు రుచికి సరిపడా
తయారీ విధానం: ముందుగా ఈ ఆవకాయ పోపు అన్నాన్ని తయారు చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకోవాల్సి ఉంటుంది.
అందులో ఇప్పటికే ఉడికించి పెట్టుకున్న సన్న బియ్యం రైస్ లేదా బాస్మతి రైస్ ని వేసి పక్కన పెట్టుకోవాలి.
ఆ తర్వాత ఒక పాన్‌లో నూనె వేడి చేసి, ఆవాలు వేసి వేయించాలి.
అవి బాగా వేయించిన తర్వాత, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
అన్ని బాగా వేగిన తర్వాత పసుపు, శొంఠి-వెల్లుల్లి పేస్ట్ వేసి, సువాసన వచ్చేవరకు వేయించాలి.
ఇలా అన్ని వేగిన తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కలపాలి.
ఆ తర్వాత ఆవకాయ ముక్కలు వేసి, 2 నుంచి 3 నిమిషాలు గరిటతో కలుపుతూ బాగా వేయించుకోవాలి.
ఇలా వేగిన తర్వాత ఉడికించిన అన్నం వేసి, బాగా మిక్స్ చేసుకోవలసి ఉంటుంది.
ఆ తర్వాత అన్నం వేడిగా మారే వరకు కలుపుతూ ఉండాలి.
బాగా వేడెక్కిన తర్వాత పైనుంచి కొత్తిమీర వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. అంతే సులభంగా ఆవకాయ అన్నం రెడీ అయినట్లే