Pension In Telangana: తెలంగాణ పెన్షనర్లకు మంత్రి సీతక్క కీలక అప్డేట్.. ప్రతినెల వారికి రూ.6 వేలు ఎప్పటినుంచంటే..?

Telangana Pension Update: కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటై ఇప్పటికే నెలలు గడుస్తున్నాయి. అయితే, ఇప్పటి వరకు పెన్షన్ల పెంపుపై ఊసే లేదు. దీంతో పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఈ పెన్షన్ పెంపుపై గుడ్‌ న్యూస్‌ చెప్పారు.
 

1 /5

తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యాన్ని మొట్టమొదట ప్రారంభించింది. ఆ తర్వాతి కాలంలో రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు సదుపాయాన్ని కూడా ప్రారంభించింది.   

2 /5

అయితే, ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న పింఛను దారులకు మాత్రం ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఏ అప్డేట్‌ రాలేదు. రైతు రుణమాఫీ, రైతు భరోసాపై మాత్రమే ప్రభుత్వం ఎక్కువగా దృష్టి పెట్టింది. పింఛను దారులపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  

3 /5

ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఈ విషయంపై కీలక అప్డేట్‌ ఇచ్చారు. తాజాగా అభయహస్తంలో భాగంగా అప్లై చేసుకున్న కొత్త పింఛనుదారుల్లో అర్హులైనవారి జాబితా సిద్ధం చేయాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ పథకాన్ని చేయూత స్కీమ్‌ ద్వారా అందించనున్నారు.  

4 /5

అలాగే కాంగ్రెస్‌ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే వృద్ధులకు రూ. 4 వేలు, దివ్యాంగులకు రూ. 6 వేలు అందిస్తామని, కానీ, ఎప్పటి నుంచి అనేది ఇప్పటికీ స్పష్టమైన తేదీ చెప్పలేను కానీ, త్వరలోనే అర్హులైన వారికి పెరిగిన పెన్షన్‌ అందుతుందని దీనిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం దృష్టిసారిస్తోందని చెప్పారు.  

5 /5

ఇప్పటికే మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ కొత్త ప్రభుత్వం టీడీపీ ఏర్పాటు కాగానే మొదటి నెలలోనే ఎరియర్స్‌తో రూ. 7 వేలు పింఛనుదారుల ఖాతాలో జమా అయ్యాయి. కానీ, మన రాష్ట్రంలో ఇప్పటికీ పింఛన్ల పెంపకంపై ఎటువంటి అప్డేట్‌ లేకపోవడంతో పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు.