Hyderabad Bonalu 2024: హైదరాబాద్‌ బోనాలు.. 28, 29 తేదీల్లో ఈ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు ముందుగానే తెలుసుకోండి

Hyderabad Bonalu 2024 Traffic Restrictions: హైదరాబాద్‌ బోనాలు సందర్భంగా ట్రాఫిక్‌ ఆంక్షలను విధించారు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు. వాహన చోదకులు ఈ రూట్లను ముందుగానే తెలుసుకుని ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ మళ్లింపుల గురించిన వివరాలు తెలుసుకోవాలి. ఆ వివరాలు తెలుసుకుందాం.
 

1 /6

హైదరాబాద్‌ బోనాలు రానున్న ఆదివారం జూలై 28, 29 న నిర్వహించనున్నారు. సింహ వాహినీ శ్రీ మహంకాళి లాల్‌ దర్వాజ బోనాల వేడుకల సందర్భంగా ఆదివారం, అంబారీ పై అమ్మవారి ఊరేగింపు వేడుకలు సోమవారం 29న నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఈ రెండు రోజులపాటు హైదరాబాద్‌ పోలీసుకులు ట్రాఫిక్‌ మళ్లింపులకు చర్యలు చెపట్టారు.  ముఖ్యంగా ఓల్డ్‌సిటీలోని ఫలక్‌నూమా, చార్మినార్, మీర్‌చౌక్‌, బహదూర్‌పురాలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉన్నాయి.  

2 /6

జూలై 28వ తేదీ.. లాల్‌ దర్వాజ నుంచి సింహ వాహినీ శ్రీ మహంకాళి ఆలయానికి వెళ్లే రోడ్డులోవాహనచోదకులు హిమ్మత్‌ పురా, షేంషీర్‌గంజ్‌ నుంచి నాగులచింత - గౌలిపురా సుదా టాకీస్‌ గుండా ట్రాఫిక్‌ మళ్లింపులు చెపట్టారు. చంద్రయాణగుట్ట/ కందికల్‌ గేట్‌ ఉప్పుగూడ గుండా వచ్చే వాహనాలను చత్రినాక అవుట్‌ పోస్ట్‌ నుంచి గౌలిపురా/ నాగులచింత గుండా వెళ్లాల్సి ఉంటుంది.

3 /6

జూలై 29వ తేదీ.. MBNR క్రాస్‌ రోడ్‌ నుంచి వచ్చే వాహనాలను ఇంజిన్‌ బౌలి నుంచి మళ్లించి జహానుమా, గోషామహాల్‌, తాడ్‌బన్‌ లేదా గోషామహల్‌ మిస్త్రీ గంజ్‌, ఖిలావత్‌ గుండా మళ్లించనున్నారు. చార్మినార్‌ పంచమోహల్లా నుంచి వచ్చే వాహనాలను హరి బౌలి,ఓల్గా హోటల, మిస్ట్రీ గంజ్‌ గుండా.. ఛాదర్‌ఘాట్‌ వెళ్లే వాహనాలు ఎస్‌జే రోటరీ నుంచి మళ్లించి పురానీ హవేలీ రోడ్‌, శివాజి బ్రిడ్జి, ఛాదర్‌ఘాట్‌కు మళ్లించనున్నారు

4 /6

ఇక మీర్‌చౌక్‌,మొఘల్‌పురా నుంచి వచ్చే వాహనాలు మిర్‌ కా దైరా నుంచి మొఘల్‌పురా వాటర్‌ ట్యాంక్‌ వైపు మళ్లించనున్నారు.ఖిలావత్‌/ మూసబౌలి నుంచి మోతిగల్లి T జంక్షన్‌ - ఖిలావత్‌ ప్లేగ్రౌండ్‌ ఓల్గా జంక్షన్‌నుంచి ఫతే దర్వాజ, మిస్త్రీ గంజ్‌కు మళ్లించనున్నారు.  

5 /6

పార్కింగ్‌.. అలయాబాద్‌ నుంచి వచ్చే వాహనాలు మెయిన్‌ రోడ్‌ పై ఉన్న దేవిప్లైవుడ్‌ ఎదురుగా, పోస్ట్‌ఆఫీస్‌, శాలిబండ,ఆల్కా థియేటర్‌ నాగులచింత ఖాళీ స్థలంలో పార్కింగ్‌ చేయవచ్చు. హరిబౌలి, గౌలిపురా నుంచి వచ్చే వాహనాలు ఆర్యవైశ్య మందిర్ ఎదురుగా సుదా థియేటర్‌ గల్లి, ఆల్కా థియేటర్‌ ఖాళీ ప్రదేశ, వీడీపీ స్కూల్‌ గ్రౌండ్‌లో పార్కింగ్‌ చేయవచ్చు

6 /6

ఈ సమయంలో టీజీ, ఏపీఎస్‌ఆర్‌సీ బస్సుల ద్వారా చార్మినార్‌, ఫలక్‌నూమా, నయాపూల్‌ గుండా అనుమతించరు. ఓల్డ్‌ సీబీఎస్‌, అఫ్జల్‌గంజ్‌, దారుల్‌షిఫా క్రాస్ రోడ్డు, ఛత్రినాక, ఇంజిన్‌ బౌలి ద్వారా బస్సులను మళ్లించనున్నారు. వాహనచోదకులు ఈ ట్రాఫిక్‌ నియమాలు పాటించాలని ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 9010203626 ట్రాఫిక్‌ పోలసుల హైల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్‌ చేయవచ్చు.