Dulquer Salman: దుల్కర్ సల్మాన్ భార్యని చూశారా? హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోకుండా..!

Dulquer Salmaan: మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి టాలీవుడ్ లో ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. అటువంటి స్టార్ హీరో.. వారసుడిగా దుల్కర్ సల్మాన్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అయితే అతని కొడుకు కన్నా ఎక్కువ.. మంచి నటుడి పేరు తెచ్చుకున్నాడు ఈ హీరో. ముఖ్యంగా తెలుగులో దుల్కర్ చేసిన మహానటి, సీతారామం.. సినిమాలు రెండు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాయి.

1 /5

చాలా తక్కువ కాలంలో.. సొంత టాలెంట్ తో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఈ మలయాళీ యంగ్ హీరో తెలుగులో కూడా బాగా పాపులర్ అయ్యాడు. మహానటి మూవీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన దుల్కర్..తన నటనతో మొదటి సినిమాలోనే మంచి మార్కులు కొట్టేశాడు. 

2 /5

ఇక ఆ తర్వాత అతను నటించిన సీతా రామం సినిమా అతనికి మరో బ్లాక్ బస్టర్ అందించింది. ఔ చిత్రంలో మిలిటరీ ఆఫీసర్ గా..అతని నటన విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక ఈ మూవీ తరువాత నుంచి దుల్కర్ కి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం మొదలయ్యాయి. 

3 /5

తాజాగా కల్కి చిత్రంలో.. చిన్నప్పటి ప్రభాస్ ని పెంచిన కెప్టెన్ క్యారెక్టర్ లో దుల్కర్ నటించాడు. కల్కి పార్ట్ 2 లో అతని పాత్రకు మరింత స్కోప్ ఉండే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. కాగా త్వరలో లక్కీ భాస్కర్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న లక్కీ భాస్కర్ సెప్టెంబర్ 7న విడుదల కాబోతుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది.  

4 /5

తాజాగా పవన్ సాదినేని.. దర్శకత్వంలో ఆకాశంలో ఒక తార అనే స్ట్రైట్ తెలుగు మూవీకి దుల్కర్ ఓకే చెప్పాడు. ఇక త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమవుతుంది. కాగా ఈ విషయాలు కాసేపు పక్కన పెడితే.. ప్రస్తుతం దుల్కర్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దానికి కారణం మాత్రం దుల్కర్ కాదు.. అతని భార్య అమల్ సుఫీయా అనే చెప్పాలి. అమల్ సుఫీయాను 2011లో దుల్కర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ ఒక అమ్మాయి కూడా ఉంది.  

5 /5

వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఇక వీరిద్దరి ఫోటోలు, వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. దుల్కర్ సల్మాన్, అమల్ ఫొటోలు చూసిన నెటిజెన్లు  అమల్ స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోదు అంటూ కామెంట్స్ పెట్టడంతో పాటు.. ఆమె అందాన్ని తెగ పొగడేస్తున్నారు.