Baby Berths: తల్లిబిడ్డల సౌకర్యవంతమైన ప్రయాణానికే బేబీ బెర్తుల ప్రయోగం: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌

Baby Berths In Rail:  సాధారణంగా పిల్లలతో ట్రైన్‌ జర్నీ అంటేనే ఎంతో కష్టంతో కూడుకున్నది. అయితే, రైల్వేలో పసిపిల్లలతో ప్రయాణం చేస్తున్న తల్లులకు ప్రత్యేకంగా ఓ వినూత్న ప్రయోగం చేసింది. 
 

1 /5

రైల్వేప్రయాణీకులు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఎప్పటి కప్పుడు మార్పులు చేసే ఇండియన్‌ రైల్వే, లోయర్‌ బెర్త్‌లో కాస్త మార్పులు చేసి బేబీ బెర్త్‌ను తయారు చేసింది ఇండియన్‌ రైల్వే తొలిసారిగా ఈ బేబీ బెర్త్‌లను లఖనవు మెయిల్‌ ట్రైన్‌లో మొదలుపెట్టింది. ఈ విషయాన్ని ఈరోజు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ రాజ్యసభలో తెలిపారు.  

2 /5

ఇండియన్‌ రైల్వేలో నిత్యం కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. వారికి తగ్గట్టుగా రైల్వే కూడా అనేక సదుపాయాలను అందుబాటులో ఉంచుతుంది. ఈ క్రమంలోనే చంటి బిడ్డలతో ప్రయాణిస్తున్న తల్లులకు కూడా వినూత్న ప్రయోగం చేపట్టింది. లోయర్ బెర్తులో కొన్ని మార్పులు చేసి చంటి బిడ్డకోసం బేబీ బెర్త్‌ను తయారు చేశారు.  

3 /5

ఇలా చేయడం వల్ల తల్లిబిడ్డ ఎంతో సౌకర్యవంతంగా రైలు ప్రయాణం చేయవచ్చు. ఈ బెర్త్‌ వద్దు అనుకున్నప్పుడు దాన్ని లోయర్‌ బెర్త్‌ కిందకు జరుపుకునే సదుపాయం కూడా ఉంది. ఈ విషయాన్ని ఈ రోజు రాజ్యసభలో ఎంపీ సమర్‌ సింగ్‌ రైల్వే మంత్రిని అడిగిన ప్రశ్నల్లో భాగంగా అశ్విని వైష్ణవ్‌ ఈ బేబీ బెర్త్‌ల గురించిన ప్రస్తావన తీసుకువచ్చారు.  

4 /5

ముఖ్యంగా చిన్నపిల్లలతో కలిసి ప్రయాణించే తల్లుల కోసం ఈ వినూత్న ప్రయోగాన్ని తీసుకువచ్చిన్నట్లు లఖ్‌నవు మెయిల్‌లో రెండు బెర్తులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. అంతేకాదు ఈ బెర్త్‌లు వల్ల ప్రయాణీకుల నుంచి కూడా మంచి స్పందన లభించిందన్నారు.  

5 /5

అయితే, ఇలా లోయర్‌ బెర్త్‌కు అనుకుని బేబీ బెర్త్‌ను తయారు చేసినందున ప్రయాణీకులకు సామాన్లు పెట్టుకునేందుకు కాస్త ఇబ్బందులు తలెత్తాయని కానీ, ఇది నిరంతర ప్రక్రియ ఎప్పటికప్పుడు ఇండియన్‌ రైల్వే మార్పులు ప్రయాణీకులకు సౌకర్యవంతంగా మార్పులు చేస్తుందని అశ్వినీ వైష్ణవ్‌ రాజ్యసభలో చెప్పారు.