Neeraj Chopra : నీరజ్ చోప్రా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..మీరూ ట్రై చేయోచ్చు..!!


Neeraj Chopra Fitness : పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో ఫైనల్‌కు చేరిన నీరజ్ చోప్రా తాను ఎలా వర్కవుట్ అవుతాడు..తన ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందామా? 

1 /6

 Neeraj chopra fitness diet : టోక్యో ఒలింపిక్స్ జావెలిన్ లో స్వర్ణం గెలుచుకుని హిస్టరీ క్రియేట్ చేశాడు నీరజ్ చోప్రా. పతకం రాదనుకున్నవారికి ఏకంగా బంగారు పతకం తీసుకువచ్చిన తన సత్తా ఏంటో నిరూపించాడు. ఇక ఈ సారి పారిస్ ఒలింపిక్స్ ఫైనల్ కు చేరిన  నీరజ్ చోప్రా ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. 

2 /6

నీరజ్ చోప్రా తన ట్రైనింగ్ సమయంలో చేతులు, మోచేతులపై ఎక్కువ ఫోకస్ పెడతాడు. వాటిని బలంగా ఉంచుకునేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాడు. భుజాలు, మోచేతులు, చేయి కండరాలను ఫిట్ గా ఉంచే కేబుల్ ఫుల్ వ్యాయామాలు చేస్తాడు. తన భుజాలను మరింత ఫిట్ గా ఉంచుకునేందుకు డంబెల్స్, సైడ్ లిఫ్ట్స్ ప్రాక్టిస్ చేస్తాడు. అంతేకాదు కోర్ స్విస్ బాల్ క్రంచెస్, హామ్ స్ట్రింగ్స్ పై దృష్టి సారించే లెగ్ లిఫ్ట్‌లు చోప్రా స్ప్రింటింగ్ స్పీడ్ ను మెరుగుపరచడంలో సహాయపడతాయి.   

3 /6

జిమ్ : చోప్రా.. రోజువారీ జిమ్ రొటీన్‌లో స్క్వాట్‌లు, స్నాచ్‌లు, టైమ్డ్ సర్క్యూట్‌లు వంటి వ్యాయామాలు జాబితాలో ఉన్నాయి. ఈ మధ్యే టబటా అనే కొత్త వ్యాయామానికి ట్రైనింగ్ తీసుకున్నారు. ఈ వ్యాయామం పది వేర్వేరు వ్యాయామాల సర్క్యూట్‌ను కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కటి 20 సెకన్ల పాటు ఎక్కువగా బలాన్ని ప్రదర్శించి చేయాల్సి ఉంటుంది.  తర్వాత 10 నుంచి 15 సెకన్ల పాటు విశ్రాంతి తీసుకుంటాడు.   

4 /6

టబాటా వ్యాయామం: టబాటా వ్యాయామం అనేది క్యాలరీలను బర్న్ చేయడానికి.. వ్యాయామం తర్వాత కేలరీల బర్న్‌ను పెంచడానికి ఒక అద్భుతమైన కార్డియో సర్క్యూట్. దీనిని ఆఫ్టర్‌బర్న్ ఎఫెక్ట్ అంటారు. టోక్యో 2020 ఒలింపిక్స్ తర్వాత స్వల్ప విరామంలో కొంత బరువు పెరిగిన తర్వాత ఇది చోప్రా తన వ్యాయామ జాబితాలో దీన్ని చేర్చాడు.   

5 /6

డైట్: చోప్రా ఆహారంలో పండ్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల నిర్మాణానికి, ఆరోగ్యకరమైన కండరాలకు ఉపయోగపడతాయి. తన రోజువారీ అవసరాలను తీర్చడానికి అదనపు ప్రోటీన్‌తో తన ఆహారాన్ని తింటాడు.  

6 /6

అల్పాహారం: చోప్రా 3 నుండి 4 గుడ్డులోని తెల్లసొన, రెండు బ్రెడ్ ముక్కలు, 1 బౌల్ సూప్ తో తన రోజును ప్రారంభిస్తాడు. లంచ్‌లో పెరుగు అన్నం, పప్పులు, సలాడ్, చికెన్ లేదా సాల్మన్ ఉంటాయి. డిన్నర్: సూప్, వండిన కూరగాయలు పండ్లతో కూడిన తేలికపాటి భోజనాన్ని ఇష్టపడతాడు