Black Salt For Diabetes: బ్లాక్ సాల్ట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తారు. దీని ఉపయోగించడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Black Salt For Diabetes: నల్ల ఉప్పు లేదా బ్లాక్ సాల్ట్ అనేది ఒక రకమైన రాతి ఉప్పు. ఇది రంగులో నల్లగా ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. సాధారణ ఉప్పుతో పోలిస్తే ఇది కొద్దిగా భిన్నమైన రుచిని కలిగి ఉంటుంది. ఇది ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తారు.
నల్ల ఉప్పు సహజంగా ఏర్పడే ఒక ఖనిజం. ఇది భూమిలోని లోతుల్లో ఉన్న ఖనిజాలతో కలిసి సముద్రపు నీరు ఆవిరైపోయినప్పుడు ఏర్పడుతుంది.
ఇందులో సల్ఫర్, ఐరన్ వంటి ఖనిజాలు ఉండటం వల్ల ఇది నల్లగా కనిపిస్తుంది. ఇందులో బోలెడు ఆరోగ్యలాభాలు ఉన్నాయి.
దీని ఉయోగించడం వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని వైద్యులు చెబుతున్నారు.
డయాబెటిస్ సమస్యతో బాధపడేవారు ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
కొన్ని అధ్యయనాలు బ్లాక్ సాల్ట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని సూచిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇందులో ఉండే సోడియం, కాల్షియం షుగర్ లెవెల్స్‌ను తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది.
గ్యాస్, అజీర్ణం, అధిక బరువు వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది.
బ్లాక్ సాల్ట్ వాటర్ ఎలా తయారు చేసుకోవాలి: ముందుగా ఒక గ్లాస్ వేడి నీటిని తీసుకోవాలి. నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడు బ్లాక్ సాల్ట్‌ను కలుపుకొని తాగాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
డయాబెటిస్ నిర్వహణకు ప్రధానంగా ఆహార నియంత్రణ, వ్యాయామం, మందులే మార్గం.
గమనిక: మీరు ఏదైనా కొత్త ఆహార అలవాట్లు చేర్చుకొనే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం చాలా అవసరం.