How to become Air Hostess: ఫ్లైట్ జర్నీ చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా ఆహ్వానం పలికేది ఎయిర్ హోస్టెస్. ఈ అందమైన ముద్దుగుమ్మలు విమాన ప్రయాణం చేస్తున్న ప్రతిఒక్కరితో మర్యాదగా మెలుగుతూ కావాల్సిన సౌకర్యాలను అందిస్తారు.
ఇలాంటి ఎయిర్ హోస్టెస్ కావాలని మీరు అనుకుంటున్నారా? దేశవిదేశీయానం చేయాలనే కోరిక ఉన్నవారికి ఇది బెస్ట్ జాబ్. అంతేకాదు ఇందులో మీరు ఆకర్షణీయమైన జీతంతోపాటు ఇతర బెనిఫిట్స్ కూడా పొందుతారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
ఎయిర్ హోస్టెస్ జాబ్ రానురాను మరింత ఆదరణ పెరుగుతుంది. మంచి జీతం అందిస్తూ విదేశీయానం చేయడానికి ఎంతగానో ఉపకరిస్తోంది. ఇందులో ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి ఈస్థాయికి చేరుకోవడానికి సహాకారం కూడా అందిస్తారు.
ఎవియేషన్ ఎక్స్‌పర్ట్ ఒకరు ఓ వార్త పత్రికతో ఎయిర్ హోస్టెస్ జాబ్ చేసేవారి జీతభత్యాలు ఎలా ఉంటాయో వివరించారు. ముఖ్యంగా ఎయిర్ హోస్టెస్ కావాలనుకునేవారు ఏ అర్హత కలిగి ఉండాలి కూడా షేర్ చేశారు. ముఖ్యంగా ఈ ఎయిర్ హాస్టేస్ జాబ్‌లో ఎంట్రీ లెవల్‌లోనే ఏడాదికి రూ. 5 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు పొందుతారు.
మీ అనుభవం పెరుగుతున్న కొద్దీ జీతం కూడా పెరుగుతుంది. అంటే దాదాపు నెలకు రూ. 1 లక్ష నుంచి రూ.1.5 లక్షలు పొందుతారు. అయితే, అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్‌లో ఎక్కువ ప్యాకేజీ పొందుతారు. ఇది కాకుండా ఇతర ట్రావెల్ అలొవెన్సులతోపాటు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ కూడా పొందుతారు.
ఎయిర్ హోస్టెస్ జాబ్ చేయాలనకునేవారు గ్రాడ్యూయేషన్ డిగ్రీ పుర్తి చేసి ఉండాలి. ఇంటర్‌లో కనీసం 55 శాతం మార్కులు పొంది ఉండాలి. హై స్కూల్ తర్వాత పేరుపొందిన ఎయిర్ హాస్టేస్ ట్రైనింగ్ కోర్స్ రెండేళ్లపాటు చేసి ఉన్నవారు కూడా అర్హులు. మంచి కమ్యూనికేషన్ స్కిల్ కలిగి ఉండాలి. ఇంగ్లీష్, హిందీ, ఇతర ఫారేన్ లాంగ్వేజీలో కూడా పట్టుఉండాలి. ఇటువంటివారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.