Sreeleela: దివి నుంచి దిగివచ్చిన అతిలోకసుందరిలా కవ్విస్తోన్న శ్రీలీల..!

Sreeleela Latest Photos: శ్రీలీల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తన మొదటి సినిమా పెళ్లి సందడితోనే అందరిని ఎంతగానో ఆకట్టుకుంది ఈ హీరోయిన్. కానీ వరస డిజాస్టర్ వల్ల ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 

1 /5

రాఘవేంద్రరావు పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రీలీల. తన మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకుంది ఈ హీరోయిన్. కానీ శ్రీ లీలా దశ తిరిగింది మాత్రం ధమాకా చిత్రంతో. 

2 /5

రవితేజ హీరోగా వచ్చిన ధమాకా సినిమా…ఈ హీరోయిన్ కి వరస ఆఫర్లు తెచ్చిపెట్టింది. ధమాకా సినిమా విజయానికి కారణం శ్రీలీల అందం, డాన్స్ అని అప్పట్లో ఈ హీరోయిన్ ని ఆకాశానికి ఎత్తేశారు అభిమానులు. ఇక వరసగా ఏడు సినిమా అవకాశాలు అందుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. 

3 /5

దురదృష్టం కొద్దీ ఈ హీరోయిన్ కి వరస ప్లాపులు రావడం మొదలయ్యాయి. అయితే బాలకృష్ణతో చేసిన భగవాన్ కేసరి సినిమా మాత్రం.. శ్రీలీల కి మంచి విజయం అందించింది. ముఖ్యంగా ఈమెకు నటన పరంగా వందకి వంద మార్కులు తెచ్చి పెట్టింది ఈ సినిమా.

4 /5

కానీ ఆ తరువాత మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం సినిమా మాత్రం శ్రీలీలకు నిరాశ మిగిల్చింది. ఇక ప్రస్తుతం తెలుగులో ఆచితూచి ఆఫర్లు ఒప్పుకుంటుంది ఈ హీరోయిన్. వరస ప్లాపులు రావడంతో.. శ్రీ లీల కథని విని.. రెండు మూడు సార్లు ఆలోచించి మరి సినిమా ఒప్పుకోవాలా లేదా అని తెలుస్తోందని వినికిడి. 

5 /5

ఈ క్రమంలో తాజాగా శ్రీలీల ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలలో శ్రీలీల భువి నుంచి దిగివచ్చిన అతిలోక సుందరిలా మెరిసిపోతూ అందరిని తెగ కవ్విస్తోంది.