Aadhar Card Update: మరో 3 రోజులే ఉచితం.. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే మీ 10 ఏళ్ల పాత ఆధార్‌ కార్డును అప్డేడ్‌ చేసుకోండిలా..!

Aadhar Card Update For 10 Years Old Copy: ఆధార్‌ కార్డు మీరు తీసుకుని పదేళ్లు దాటిందా? అయితే, వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి. దీనికి కేవలం మరో మూడు రోజుల గడువు మాత్రమే ఉంది. సెప్టెంబర్‌ 14 ఆధార్‌ కార్డు అప్డేడ్‌ చేసుకోవడానికి చివరి తేదీ.
 

1 /5

యూఐడీఏఐ ఆధార్‌ కార్డు విధానాన్ని 15 ఏళ్ల కిందట ప్రారంభించింది. దీని ద్వారా ఏ లావదేవీలైనా నిర్వహించవచ్చు. ఇది ప్రతి ఒక్కరికీ తప్పనిసరి చేశారు. అందుకే ప్రతిఒక్కరూ ఆధార్‌ కార్డు కలిగి ఉన్నారు. అయితే, పాత ఆధార్‌ కార్డు అంటే పదేళ్లు అంతకు మించిన పాత ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేసుకోవాలి. దీనికి కేంద్రం ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునేలా చేశారు.   

2 /5

సాధారణంగా ఆధార్‌ కార్డులో ఏ మార్పులు చేసినా రూ.50 వసూలు చేస్తారు. కానీ, పదేళ్లు పైబడిన ఆధార్‌ కార్డులు అప్‌డేట్‌ చేసుకోవడానికి ఉచిత ఆఫర్ ప్రకటించింది. దీనికి ఎక్కడకూ వెళ్లకుండానే ఇంట్లోనే సింపుల్‌గా ఆధార్‌ కార్డును అప్డేట్‌ చేసుకోవచ్చు. దీనికి మరో మూడు రోజులే మిగిలింది. సెప్టెంబర్‌ 14 వరకు ఆధార్‌ కార్డును అప్డేట్‌ చేసుకోవచ్చు.   

3 /5

ఆధార్‌ కార్డు ద్వారా అడ్రస్, పేరు, ఫోన్‌ నంబర్లు మార్పు చేసుకోవచ్చు. ఐదేళ్లు పైబడిన ఆధార్‌ కార్డు కలిగిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాలి. అయితే, తమ ఆధార్‌ కార్డులను అప్డేడ్‌ చేసుకోకపోయినా అవి పనిచేస్తాయి. కానీ,  వెంటనే అప్‌డేట్‌ చేసుకుంటే మేలు.  

4 /5

2009 జనవరి 28 న దేశవ్యాప్తంగా ఆధార్‌ కార్డు విధానాన్ని కేంద్రం ప్రారంభించింది. ఇది ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డు. ఈ ఆధార్‌ కార్డు ద్వారా ప్రతి ఒక్కరూ ఆధార్‌ నంబర్‌ పొందుతారు. దీంతోపాటు డెమగ్రాఫిక్‌, బయోమెట్రిక్‌ డేటా నమోదు చేస్తారు.  

5 /5

ఇక ఐదేళ్ల కంటే తక్కువ ఉన్నవారు కూడా ఆధార్‌ కార్డు పొందే సౌకర్యం కల్పించారు. బాల ఆధార్‌ కార్డు దీన్ని బ్లూ ఆధార్‌ అని కూడా పిలుస్తారు. ఐదేళ్ల కంటే చిన్నగా ఉండే పిల్లలకు దీన్ని తల్లిదండ్రులు లేదా సంరక్షుల డేటా ఆధారంగా జారీ చేస్తారు. ఆధార్‌ చివరి తేదీ సమీపిస్తోన్న తరుణంలో వెంటనే మీ వివరాలను అప్‌డేట్‌ చేసుకోండి లేకపోతే ఆ తర్వాత అప్డేడ్‌ చేయడానికి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.