Venus Transit 2024: శుక్రుడి గోచారంతో అక్టోబర్ 13 వరకూ అందరికీ దశ తిరిగిపోనుందా, ఊహించని ధనలాభం ఎవరెవరికంటే

Venus Transit 2024 in Telugu: హిందూ జ్యోతిష్యంలో శుక్ర గ్రహానికి చాలా ప్రాధాన్యత, మహత్యం ఉంది. ఎందుకంటే ఈ గ్రహం సుఖ సంతోషాలకు, అష్ట ఐశ్వర్యాలకు ప్రతీతి అని నమ్మకం. ఇప్పటి వరకూ శుక్రుడు కన్యా రాశిలో కొలువుదీరి ఉన్నాడు. ఇవాళ అంటే సెప్టెంబర్ 18 నుంచి కన్యా  రాశి నుంచి తులా రాశిలో మారనున్నాడు. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 13 వరకూ మొత్తం 12 రాశుల జాతకం మారిపోనుంది. అదెలా ఉంటుందో పరిశీలిద్దాం

Venus Transit 2024 in Telugu: హిందూ జ్యోతిష్యంలో శుక్ర గ్రహానికి చాలా ప్రాధాన్యత, మహత్యం ఉంది. ఎందుకంటే ఈ గ్రహం సుఖ సంతోషాలకు, అష్ట ఐశ్వర్యాలకు ప్రతీతి అని నమ్మకం. ఇప్పటి వరకూ శుక్రుడు కన్యా రాశిలో కొలువుదీరి ఉన్నాడు. ఇవాళ అంటే సెప్టెంబర్ 18 నుంచి కన్యా  రాశి నుంచి తులా రాశిలో మారనున్నాడు. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 13 వరకూ మొత్తం 12 రాశుల జాతకం మారిపోనుంది. అదెలా ఉంటుందో పరిశీలిద్దాం

1 /12

కన్యా రాశి కన్యా రాశి జాతకులకు వ్యక్తిగతంగా ఈ సమయం చాలా బాగుంటుంది. అమితమైన ధనలాభం కలుగుతుంది. ఆర్ధికంగా పటిష్టంగా ఉంటారు. కెరీర్, వ్యాపారంలో ఊహించని లాభాలుంటాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో ఆనందం ఉంటుంది. పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం

2 /12

వృషభ రాశి వృషభ రాశి జాతకులకు శుక్రుడి తులా రాశి ప్రవేశం కారణంగా అద్భుతమైన ఊహించని లాభాలు కలగనున్నాయి. కెరీర్‌లో విజయం ప్రాప్తిస్తుంది. ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. ప్రత్యర్ధులపై విజయం లభిస్తుంది. రుణాల నుంచి విముక్తి పొందవచ్చు. 

3 /12

వృశ్చిక రాశి వృశ్చిక రాశి జాతకులకు శుక్రుడి తులా రాశి ప్రవేశం కారణంగా అంతా అనుకూలంగా ఉంటుంది. ప్రత్యర్ధుల నుంచి ఎలాంటి ఆపద ఎదురుకాదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉద్యోగ, వ్యాపారులకు ప్రయోజనం కలుగుతుంది. ఆర్ధికంగా లాభం కలుగుతుంది

4 /12

ధనస్సు రాశి ధనస్సు రాశి జాతకులకు ఈ సమయం అత్యంత అనుకూలం. ఒత్తిడి దూరమౌతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశముంది. విద్యార్ధులు, ఉద్యోగులకు అనుకూలమైన సమయం. సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి.

5 /12

మీన రాశి మీన రాశి జాతకులకు ఈ సమయం చాలా అనుకూలమనే చెప్పాలి. కొత్త విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పని విజయవంతమౌతుంది. ఎలాంటి ఇబ్బందులు రావు. 

6 /12

తులా రాశి తులా రాశి జాతకులకు శుక్ర గోచారం ప్రభావంతో ఉద్యోగులు, వ్యాపారులకు లాభం కలుగుతుంది. నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. వ్యాపారంలో లాభాలు ఎదురౌతాయి. కెరీర్ బాగుంటుంది. పదోన్నతి, వేతనం పెంపు ఉంటుంది.

7 /12

సింహ రాశి సింహ రాశి జాతకులకు శుక్రుడి గోచారం కారణంగా అన్నీ అనుకూలిస్తాయి. ఆకశ్మిక ధనలాభం ఉంటుంది. ఊహించని విధంగా కెరీర్ లేదా వ్యాపారం వృద్ధి చెందుతుంది. జీవితంలో అద్భుతమైన మార్పులు గమనించవచ్చు. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి

8 /12

మిధున రాశి మిధున రాశి జాతకులకు అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. శుక్రుడి తులా రాశి ప్రవేశం కారణంగా విద్య, సంతానం, ప్రేమ వ్యవహారాల్లో సానుకూల పరిణామాలు ఎదురౌతాయి. వ్యాపారంలో లాభాలుంటాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. 

9 /12

మకర రాశి మకర రాశి జాతకులకు శుక్రుడి గోచారం కారణంగా అద్భుతమైన మార్పు కలగనుంది. ఉద్యోగులకు పదోన్నతితో పాటు వేతనం పెరుగుతుంది. వ్యాపారులకు అమితమైన లాభాలు కలుగుతాయి. మొత్తానికి ఆర్ధికంగా మెరుగైన స్థితిలో ఉంటారు. సుఖ సంతోషాలు కలుగుతాయి.

10 /12

కర్కాటక రాశి కర్కాటక రాశి జాతకులకు చాలా అనుకూలమైన సమయం. ఇంట్లో అంతా ఆనందం ఉంటుంది. శుక్రుడి తులా రాశి ప్రవేశం కారణంగా కెరీర్‌లో వృద్ధి ఉంటుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి.

11 /12

మేష రాశి మేష రాశి జాతకులకు శుక్రుడి గోచారం ప్రభావం శుభప్రదంగా ఉంటుంది. అంటే అంతా మంచి జరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. కెరీర్ బాగుంటుంది. ఆర్ధికంగా ప్రయోజనం చేకూరుతుంది. 

12 /12

కుంభ రాశి కుంభ రాశి జాతకులకు అదృష్టం మారిపోనుంది. ఊహించని లాభాలు కలుగుతాయి. శుక్రుడి తులా రాశి ప్రవేశం కారణంగా దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులకు అంతా కలిసొస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది