Jr NTR vs Prabhas: ఎన్టీఆర్ వర్సెస్ ప్రభాస్.. విభేదాలకు కారణం..?

Jr NTR controversy; సినీ ఇండస్ట్రీలో ఎవరితో కూడా విభేదాలు పోకుండా.. ఆజాతశత్రువులుగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్,  ప్రభాస్ ఒకానొక సమయంలో.. ఒక వ్యక్తి వల్ల గొడవపడినట్లు సమాచారం. ఇండస్ట్రీలో ఇద్దరికీ మంచి పేరు ఉంది.  అయితే అలాంటిది వీరిద్దరూ మాట్లాడుకోకపోవడం.. ఏంటి అంటూ అప్పట్లో అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1 /7

సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఏకంగా గ్లోబల్ స్థాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్,  ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది.   

2 /7

ఇదిలా ఉండగా మరోవైపు రెబెల్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని.. పాన్ ఇండియా హీరోగా చలామణి అవుతూ దూసుకుపోతున్న రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ , ఫౌజీ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఒకవైపు ప్రభాస్ రాజాసాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగానే, మరొకవైపు ఫౌజీ సినిమా షూటింగ్ కూడా జరుగుతోందని సమాచారం. 

3 /7

ఈ రెండు చిత్రాల తర్వాత స్పిరిట్ కూడా విడుదల కాబోతోందట. పరిశ్రమలో అందరితో ఎంత  స్నేహంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. షూటింగ్ సమయంలో కూడా తనతో పాటు పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా ఇంటి దగ్గర నుంచే భోజనం తెప్పిస్తారు. ఒకరకంగా చెప్పాలి అంటే అందరికీ అజాత శత్రువు అనవచ్చు.

4 /7

అయితే అజాత శత్రువు అయిన ప్రభాస్.. జూనియర్ ఎన్టీఆర్ తో మాట్లాడటం లేదంటే ఆశ్చర్యం వేస్తోంది కదా..  అయితే ఒక దర్శకుడు వల్లే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని సమాచారం. అయితే ఇది ఇప్పుడు కాదు కానీ గతంలో జరిగిన విషయం. ప్రభాస్,  ఎన్టీఆర్ దాదాపు 6 నెలల పాటు మాట్లాడుకోలేదని సమాచారం. 

5 /7

పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోలుగా ఉన్న ఈ ఇద్దరికీ కూడా ఒక దర్శకుడు వల్ల విభేదాలు వచ్చాయట. అయితే ఆ విభేదాలు ఇద్దరి మధ్య దూరం పెంచాయి. కానీ ఆ డైరెక్టర్ మాత్రం ఇద్దరితో బాగానే ఉన్నట్లు సమాచారం. 

6 /7

ఒకానొక సమయంలో ఇద్దరి మధ్య మాటలు లేకుండా పోయిన ఆరు నెలల తరువాత అనుకోకుండా ప్రభాస్, ఎన్టీఆర్ ఒక ఈవెంట్ కి హాజరయ్యారట. ఈ క్రమంలోనే  ఒకరికొకరు ఎదురుపడడంతో ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకొని , అక్కడే కలిసి కూర్చొని ఇద్దరి మధ్య ఎక్కడ చెడింది..?  ఎక్కడ బేదాభిప్రాయాలు వచ్చాయి అనే విషయాలను తెలుసుకొని, ఒకరికొకరు కారణాలేంటో తెలుసుకొని ఆ తర్వాత కలిసిపోయారట.

7 /7

ఎవరు తప్పుగా అర్థం చేసుకున్నారు అనే విషయాలను చర్చించుకున్నారట. అప్పటి నుంచి ఇద్దరూ మళ్లీ మంచి స్నేహితులుగా మారిపోయినట్లు సమాచారం. ఏది ఏమైనా అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటే ఇద్దరి మధ్య విభేదాలు రావు అని నిరూపించారు ప్రభాస్ , ఎన్టీఆర్.