Vastu tips to attract Lakshmi: ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే అష్ట ఐశ్వర్యాలు మీ సొంతం..!

Vastu Tips for money: ఆర్థిక సమస్యలు అనేవి.. సంపాదించని వారికే కాదు సంపాదించే వారికి కూడా ఉంటాయి.xdఅందుకు ముఖ్య కారణం సంపాదించినా కానీ లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర నిలబడక పోవడం. మరి అలాంటి లక్ష్మీదేవిని నిలుపుకోవాలంటే కొన్ని వాస్తు టిప్స్ పాటించడం తప్పనిసరి.

1 /7

డబ్బు ప్రతి ఒక్కరికి నిత్యవసరంగా మారింది. ఉదయం లేచింది మొదలు.. రాత్రి వరకు ఈ డబ్బు సంపాదించడానికి కష్టపడుతున్నారు. అయితే కొంతమందికి ఎంత డబ్బు సంపాదించినా సరే ఏమి మిగలదు.  పైగా ఆర్థిక సమస్యలతో ..కొట్టుమిట్టాడుతూ ఉంటారు.

2 /7

మీరు కూడా  ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నట్లయితే కచ్చితంగా కొన్ని రకాల వస్తువులను ఇంట్లో ఉంచుకోవాలని పండితులు చెబుతున్నారు. 

3 /7

పిరమిడ్ వాస్తు ప్రకారం ఇంట్లో వెండి, ఇత్తడి లేదా రాగితో తయారుచేసిన పిరమిడ్లను కలిగి ఉండడం వల్ల సంపద పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పిరమిడ్ ను  ఈశాన్యం మూలలో ఉంచాలి. 

4 /7

పంచముఖ ఆంజనేయస్వామి చిత్రపటం ఇంట్లో ఉండడం వల్ల ఐశ్వర్యానికి లోటు ఉండదు. 

5 /7

పద్మంపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రాన్ని పూజ గదిలో.. ఉంచడం వల్ల అష్టైశ్వర్యాలకు లోటు ఉండదు. 

6 /7

వంట గదిలో ఉండే ట్యాంక్ లేదా నీటి కుండల్లో నీరు ఎప్పుడు నిల్వ ఉండేలా చూసుకోవాలి. 

7 /7

ఇలాంటి కొన్ని చిట్కాలు పాటిస్తే లక్ష్మీదేవి ఇంట్లో తాండవం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.