Pm Kisan Yojana: పీఎం కిసాన్ డబ్బులు మీ ఖాతాల్లో పడ్డాయా? మొబైల్‌ ద్వారా ఇలా వెంటనే చెక్‌ చేసుకోండి..

Pm Kisan Yojana 18 th instalment: పీఎం కిసాన్‌ డబ్బులు ఏడాదికి మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. చిన్న సన్నకారు రైతలను ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ సహాయం అందిస్తుంది. 18వ విడత పీఎం కిసాన్‌ డబ్బులను ఈనెల 5వ తేదీ రైతుల ఖాతాల్లో జమా చేయనుంది. ఎలా చెక్‌ చేసుకోవాలో తెలుసుకుందాం.
 

1 /8

17 విడత పీఎం కిసాన్‌ డబ్బులను  20 వేల కోట్లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి రూ.6 వేలు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తుంది. దీనికి మీ ఆధార్‌ కార్డు బ్యాంకు ఖాతాకు లింక్‌ అయి ఉండాలి. ఈ పథకం ద్వారా 90 మిలియన్ల రైతులు మన దేశంలో లబ్ధి చేకూరనుంది.  

2 /8

ఈ పీఎం కిసాన్‌ పథకం ద్వారా మీరు కూడా లబ్ది పొందాలంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్లు పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌లో అప్డేడ్‌ అయ్యాయా? లేదా చెక్ చేసుకోండి.  

3 /8

ఆ తర్వాత హోంపేజీలో న్యూ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇది అన్ని భాషల్లో అందుబాటులో ఉంటుంది.  తెలుగు, కన్నడ, మరాఠి, తమిళంలో కూడా ఉంటుంది. ఆ తర్వాత రూరల్‌ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ లేదా అర్బన్‌ ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌ ఎంపిక చేసుకోవాలి.  

4 /8

మీ ఆధార్‌ లేదా మొబైల్‌ నంబర్‌, మీ రాష్ట్రం అక్కడ నమోదు చేయాలి. మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. అప్పుడు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కన్ఫమ్‌ అవుతుంది.

5 /8

ఆన్‌లైన్‌ ఇ కేవైసీ చెక్‌ చేసుకునే విధానం.. హోం పేజీలోని న్యూ రిజిస్ట్రేషన్‌ ఆప్షన్‌ ద్వారా ఇ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. మీరు మొబైల్‌ నంబర్‌ ద్వారా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. స్క్రీన్‌పై నోటిఫికేషన్‌ కూడా వస్తుంది.

6 /8

పీఎం కిసాన్‌ లబ్దిదారుల జాబితా.. పీఎం కిసాన్‌ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా స్టేటస్ చెక్‌ చేయవచ్చు. మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్‌, సబ్‌ డిస్ట్రిక్‌, ఊరు పేరును నమోదు చేయాలి.

7 /8

పీఎం కిసాన్‌ బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకునే విధానం.. పీఎం కిసాన్‌ బ్యాలెన్స్‌ 18వ విడత బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోవాలంటే మీ ఆధార్‌ కార్డు వివరాలను నమోదు చేయాలి. 'Know Your Status'పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.

8 /8

ఆ తర్వాత 'Know your registration number' ఆధార్‌ నంబర్‌తో ఓటీపీ వస్తుంది. ఈ మొబైల్‌ నంబర్‌ క్యాప్చా కోడ్‌ ఉపయోగించాలి. అప్పుడు Get Data పై క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. మీ ఇన్‌స్టాల్‌మెంటు బ్యాలెన్స్‌ చెక్‌ చేసుకోండి.